E-Paper
Advertisement

‘ఆకాశంలో ఒక తార’ పై మెగా ప్రశంసలు.. భావోద్వేగానికి లోనయ్యానంటూ!

‘ఆకాశంలో ఒక తార’ పై మెగా ప్రశంసలు..  భావోద్వేగానికి లోనయ్యానంటూ!
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి (Chiranjeevi)ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న తర్వాత ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడమే కాకుండా కొత్త టాలెంట్ ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా ఒక కొత్త సినిమా విడుదల అయ్యి సినిమా మంచిగా ఉంటే వెంటనే చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాపై అలాగే సినిమాలోని నటీనటులు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు చేస్తుంటారు. తాజాగా చిరంజీవి దుల్కర్ సల్మాన్(Dulquer Salman) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

దుల్కర్ సినిమా పై చిరు ప్రశంసలు..

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతిహాసన్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ఆకాశంలో ఒక తార(Aakasamlo oka tara). పవన్ సాదినేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని తన అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ…

నా మనసుని కదిలించిన చిత్రం..

Advertisement

తాను ఇప్పుడే ఆకాశంలో ఒక తార సినిమా చూశాను.. నా మనసుని ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఇంత స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని ఎంతో నమ్మకంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాదినేనిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తాను చాలా భావోద్వేగానికి గురి అయ్యానని దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. శృతిహాసన్, రుహానీ శర్మ మిగిలిన నటీనటులందరూ వారి పాత్రలకు ప్రాణం పెట్టి నటించారు.జీవీ ప్రకాష్ అందించిన సంగీతం, సుజిత్ సారంగ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా ప్రేక్షకులకు చేరేలా చేశాయి.

Advertisement

ఇక తల్లిదండ్రులు ఈ సినిమాని తమ పిల్లలతో పాటు కచ్చితంగా చూడాలని, ఈ కథ పిల్లలలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని చిరంజీవి తెలిపారు . ఇలాంటి ఒక గొప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్ర నిర్మాతలు స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా నిర్మాణ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ బాబి దర్శకత్వంలో కాకా సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల చేయటానికి సిద్ధమయ్యారు.

Also Read: ప్రీ స్కూల్లో అడుగుపెట్టిన క్లిన్ కారా … ఫీజు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే!

Related News

శర్వానంద్ సినిమా కోసం ఇంత ఖర్చు చేశారా? భోగి బడ్జెట్ తెలిస్తే షాక్!

ప్రీ స్కూల్లో అడుగుపెట్టిన క్లిన్ కారా … ఫీజు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే!

సినిమా ఒప్పుకోవాలంటే నాకు అవి రెండూ కావాలి.. మీనాక్షి అసలు లెక్క ఇదే!

జంబలకిడి పంబ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా!

అల్లు అర్జున్ తర్వాత మళ్లీ శర్వానంద్‌కే నేషనల్ అవార్డు.. సంపత్ నంది వైరల్ కామెంట్స్ !

మా మధ్య గొడవలు లేవు.. బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్..

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి వార్తల్లో నిజమెంత? జాతకం చూసి ఏం చెప్పారంటే!

Big Stories

Advertisement
×