Sara Arjun:సారా అర్జున్..చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తాజాగా దురంధర్ తో సత్తా చాటిన ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తనవైన క్రేజీ పిక్స్ తో నెట్టింట మంటలు పెట్టేస్తుంది.
మాములుగా ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించే ఈ అమ్మడు ఈసారి సింపుల్ అండ్ క్లాసీగా కనిపించి అభిమానులని ఫిదా చేసింది.సాధారణంగా హీరోయిన్లు ఫొటోషూట్ల కోసం స్పెషల్ గా తయారుచేసిన కాస్ట్యూమ్స్ వేసుకుంటారన్న సంగతి తెల్సిందే . కానీ సారా మాత్రం చాలా సింపుల్‌గా మెరూన్ కలర్ స్వెటర్ వేసుకుని ఫొటోలకి పోజులివ్వడం విశేషం.
ఇక ఈ మెరూన్ కలర్ స్వెటర్ పై ఉన్న ఆరెంజ్, క్రీమ్, గ్రే కలర్ ఫ్లవర్ డిజైన్స్ ఆ స్వెటర్‌కు ఇంకా మంచి అందాన్ని తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇక లూస్ గా వదిలేసిన హెయిర్, సింపుల్ మేకప్, నేచురల్ స్మైల్‌తో కెమెరా ముందు కూల్‌గా ఇచ్చిన ఈ ఫోజులు ఫ్యాషన్ ప్రియులని ఫిదా చేస్తున్నాయి.
ముఖ్యంగా చలికాలానికి తగ్గట్టుగా ఆమె ఎంచుకున్న ఈ స్వెటర్ లుక్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అయిందనే చెప్పాలి. ఫ్యాషన్ అంటే ఖరీదైన బట్టలు, ఎక్కువ మేకప్ మాత్రమే కాదు, సింపుల్ డ్రెస్‌లో కూడా స్టైలిష్‌గా ఉండొచ్చని తన ఫొటోలతో చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
ఇక సారా అర్జున్ సినీ కెరీర్ విషయానికి వస్తే చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి తన నటనతో అందరి మనసులు గెలుచుకున్న ఈ అమ్మడు, ఇప్పుడు హీరోయిన్‌గా కూడా సత్తా చాటుతుండటం విశేషం.
ముఖ్యంగా విక్రమ్ నటించిన తమిళ సినిమా ‘దైవ తిరుమగల్’లో ఆయన కూతురిగా నటించి సాలిడ్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ‘నాన్న’ పేరుతో వచ్చిన ఈ సినిమా ఇక్కడా మంచి టాక్ నే మూట గట్టుకుంది.
ఆ సినిమాలో సారా యాక్టింగ్ ఇప్పటికీ చాలామందికి గుర్తుండిపోతుంది కూడా . ఆ తర్వాత ‘సైవం’, ‘జాజ్బా’, ‘సాండ్ కీ ఆంఖ్’, ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’, ‘సిల్లూ కరుపట్టి’ లాంటి వేర్వేరు సినిమాల్లో నటించి తనని తాను ప్రూవ్ చేసుకుంది సారా.
ఇక మణిరత్నం తీసిన పెద్ద సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’లో చిన్నప్పటి నందిని పాత్రలో కనిపించి అలరించిన సారా ‘టూల్సిదాస్ జూనియర్’, ‘కొటేషన్ గ్యాంగ్’ లాంటి సినిమాలతో సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. అయితే ఈమధ్య వచ్చిన ‘ధురంధర్’ సినిమాతో ఒక్కసారిగా సారా పేరు నేషనల్ వైడ్ గా మారుమ్రోగిపోయింది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా చేసిన ఈ సినిమాలో యలీనా జమాలీ పాత్రలో కనిపించి అందరిని తనవైపుకు తిప్పుకుంది.మరో వైపు గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన తెలుగు సినిమా ‘యుఫోరియా’లో నటించి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది ఈ అందాల భామ.
మొత్తంగా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరపై మెరిసిన సారా, ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్‌లో హీరోయిన్ గా దూసుకుపోతుందనే చెప్పాలి.చూడాలి మరి సక్సెస్ ఫుల్ సినిమాలని ఖాతాలో వేసుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు స్పృష్టిస్తుందో !