E-Paper
Advertisement

Viral Video: టిప్ ఇస్తేనే డోర్స్ ఓపెన్ చేస్తా.. లండన్‌లో ఉబెర్ డ్రైవర్ ఓవరాక్షన్, కారులోనే పడుకో అని.!

Viral Video: టిప్ ఇస్తేనే డోర్స్ ఓపెన్ చేస్తా.. లండన్‌లో ఉబెర్ డ్రైవర్ ఓవరాక్షన్, కారులోనే పడుకో అని.!
Advertisement

సాధారణంగా క్యాబ్ ప్రయాణం ముగియగానే డబ్బులు చెల్లించి, త్వరగా దిగిపోవాలని ఎవరైనా కోరుకుంటారు. ముఖ్యంగా అత్యవసర పనుల మీద వెళ్లేవారికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అసహనం కలుగుతుంది. అయితే, యూకేలో ఒక మహిళా ఉబెర్ డ్రైవర్ తన ప్రయాణికురాలికి చుక్కలు చూపించింది. టిప్ ఇస్తేనే కారు తలుపులు తీస్తానని, లేదంటే లోపలే పడుకోవాలంటూ ఆ ప్రయాణికురాలిని కారులో బంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే?

Advertisement

యూకేకు చెందిన ఓ మహిళ ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణించి తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ప్రయాణం ముగిసిన తర్వాత డ్రైవర్ తనకు టిప్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. యూకేలో టిప్ ఇవ్వడం అనేది పూర్తిగా స్వచ్ఛందం, అది తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని ప్రయాణికురాలు గుర్తు చేస్తూ.. తనకు సమయం అవుతోందని, బయట తన కోసం కొందరు ఎదురుచూస్తున్నారని.. తలుపులు తీయాలని వేడుకుంది. కానీ, ఆ మహిళా డ్రైవర్ మాత్రం దీనికి నో చెప్పింది. ‘నీ దేశంలో టిప్ ఇవ్వడం నిబంధన.. నువ్వు టిప్ ఇచ్చే వరకు డోర్స్ ఓపెన్ చేయను. కావాలంటే కారులోనే పడుకో’ అంటూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది.

వైరల్ వీడియో – నెటిజన్ల ఫైర్..

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం అది సుమారు 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. ఈ వీడియోలో డ్రైవర్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సదరు డ్రైవర్ భారతీయురాలు కావచ్చని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘విదేశాలకు వెళ్లి ఇలాంటి పనులు చేస్తూ దేశం పేరు పాడుచేస్తున్నారు’ అని కొందరు, ‘ఆమెను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలి’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కస్టమర్ నుంచి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా, వారిని కారులో బంధించడం చట్టపరంగా నేరం. దీనిని బందీ చేయడం లాంటి తరహా చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే సేవలకు తగిన రుసుమును ఉబెర్ యాప్ ద్వారా చెల్లిస్తున్నప్పుడు.. అదనపు డబ్బుల కోసం ఇలా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడంపై ఉబెర్ సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ALSO READ:  Medak Crime: చెల్లిని ప్రేమించాడన్న కోపంతో.. యువకుడిని దారుణంగా కొట్టి అడవిలో పడేశారు, చివరకు సీన్ కట్ చేస్తే..?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×