BigTV English

 Kota Srinivas Rao: ఎమ్మెల్యేగా గెలిచిన కోటా… రాజకీయాలకు అందుకే దూరమయ్యారా?

 Kota Srinivas Rao: ఎమ్మెల్యేగా గెలిచిన కోటా… రాజకీయాలకు అందుకే దూరమయ్యారా?
Advertisement

Kota Srinivas: కోటా శ్రీనివాసరావు(Kota Srinivas Rao) తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయిన నటుడు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ గాను, విలన్ పాత్రలలోను నటించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈయన అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు నేడు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఈయన మరణ వార్త విన్న టాలీవుడ్ తారలోకం మొత్తం ఆయన కడుచూపుకు తరలివచ్చి కోటా శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పించడమే కాకుండా, ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.


బీజేపీ పార్టీలోకి కోటా…

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులను ప్రశంసలను సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు రాజకీయాలలో(Politics)కి కూడా అడుగుపెట్టారు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమాలలో కాస్త పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు రాజకీయాలలోకి వచ్చి అక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నారు. ఇక కోట శ్రీనివాసరావు కూడా గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి అంటే ఎంతో ఇష్టంతో ఈయన బీజేపీ పార్టీలోకి వెళ్లారు.


విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా…

బీజేపీ పార్టీలో కొనసాగుతున్న కోటా శ్రీనివాసరావు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో 1999 వ సంవత్సరంలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా(Vijayawada East MLA) ఎన్నికలలో పోటీ చేశారు. ఎన్నికలలో ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు తదుపరి ఎన్నికలలో ఓటమిపాలు అయ్యారు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈయన పూర్తిగా సినిమాలకు దూరమవుతూ రాజకీయాలలోనే స్థిరపడతారని అందరూ భావించారు కానీ ఓటమిపాలైన తర్వాత కోటా శ్రీనివాసరావు మాత్రం రాజకీయాలలో కొనసాగ లేకపోయారు.

ప్రజాసేవ చేయాలనే తపన…

రాజకీయాలలో కొనసాగుతూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఈయన రాజకీయాలలో కొనసాగ లేకపోయారు. . ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాల గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది కానీ, ఇప్పుడు డబ్బు సంపాదనే ముఖ్యంగా రాజకీయాలలోకి వస్తున్నారని ఈయన తెలియజేశారు. రాజకీయాలకు దూరమైన కోటా తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి ఆగ్ర హీరోలు అందరి సినిమాలలో కూడా నటిస్తూ ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించారు. సుమారు 700 లకు పైగా సినిమాలలో నటించిన కోటా శ్రీనివాసరావు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఇక చివరి రోజుల్లో వయసు పైబడుతున్న నేపథ్యంలో ఈయనకు అవకాశాలు రాకపోవటంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ వరుస యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈయన సినిమా ఇండస్ట్రీ గురించి, తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియచేస్తూ వచ్చారు.

Also Read: Big Tv Kissik Talks: మానస్ నా జీవితంలోకి రావడం అదృష్టం.. జబర్దస్త్ పై కన్నేసిన కావ్య?

Related News

Rashmika: ప్రేమ అంటే కంట్రోల్ చేయటం కాదు.. గౌరవించడం రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jr NTR Morphed Pics: అసభ్యకరంగా ఎన్టీఆర్‌ మార్ఫింగ్‌ ఫోటోలు.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు

Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ కోహినూరుకు బ్రేక్ …ఆ సమస్యలే కారణమా?

Parineeti Chopra: పరిణీతి ఒకప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కి పీఆర్ గా చేసిందని తెలుసా?

Prabhas Hanu Title : కొత్తదేమీ ఏం లేదు… ప్రభాస్ మూవీ అప్డేట్‌పై హోప్స్ పెట్టుకోవడం దండగ ?

NTR Neel : హీరో దర్శకుడు గొడవపై క్లారిటీ, స్పెషల్ వీడియో కూడా

Sujeeth OG: ప్రభాస్ బర్త్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇస్తున్న సుజీత్, అన్ని అలా కలిసొస్తున్నాయి

Ramya Krishnan: శివగామి పాత్ర.. చేయనని మొహం మీదే ఫోన్‌ కట్‌ చేసిన రమ్యకృష్ణ..

Big Stories

×