Kota Srinivas Rao:సినీ ఇండస్ట్రీలో మరో దిగ్గజ నటుడు దివి కెగిసారు.. కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం ఊహించలేనిది. 83 ఏళ్ల వయసున్న కోట శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో ఆయన నివాసంలోనే మరణించారు. అయితే అలాంటి కోట శ్రీనివాసరావు మరణం గురించి తెలిసి ఎంతో మంది ప్రముఖులు ఇంటికి వచ్చి ఆయన భౌతికకాయం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi), బాబు మోహన్, సురేష్ బాబు, బ్రహ్మానందం (Brahmanandam), రాజేంద్రప్రసాద్ వంటి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. అయితే అలాంటి కోట శ్రీనివాసరావు బతికున్న సమయంలో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి, మీడియా ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలా ఆయన బ్రతుకున్న సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం ఆయన మరణించాక మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోట శ్రీనివాసరావు మనసు దోచిన నేటి తరం హీరోలు..
ఇందులో భాగంగా కోటా శ్రీనివాసరావు 750 కి పైగా సినిమాల్లో నటించారు. అలా మూడు తరాల నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.అయితే ఇప్పటివరకు ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు కానీ ఇప్పటి జనరేషన్లో కోట శ్రీనివాసరావు గారికి ఇష్టమైన హీరోలు కేవలం ముగ్గురే ముగ్గురట.మరి ఇంత మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కోట శ్రీనివాసరావు మనసు దోచిన ఇప్పటి తరం ముగ్గురు హీరోలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ ముగ్గురు వీరే.. మీ హీరో కూడా ఉన్నారే..
కోట శ్రీనివాసరావు బ్రతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నాకు ఇప్పటి జనరేషన్ హీరోలలో కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే ఇష్టం. అందులో జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR),సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu),అల్లు అర్జున్(Allu Arjun)..ఈ ముగ్గురు హీరోలు అంటే నాకు చాలా ఇష్టం.. వీరందరిలో మహేష్ బాబు అందగాడు కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతారు. అలాగే ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు వచ్చినా అందం విషయంలో ఆయన్ని బీట్ చేసేవారు ఎవరు ఉండరు.. ఇక జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అంటే నాకు చాలా ఇష్టం. బన్నీ ఎన్టీఆర్ లలో ఈ డైలాగ్స్ చెప్పే విషయంలో మాత్రం నేను జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టపడతాను. అయితే అల్లు అర్జున్ అంటే కూడా ఇష్టమే.. ఈయన చేసే డాన్స్, యాక్షన్ నన్ను ఆకట్టుకుంటాయి.అందుకే ఇప్పటి తరం హీరోలలో నాకు ఈ ముగ్గురు హీరోలు మాత్రమే ఫేవరెట్ అంటూ కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు..
అల్లు అర్జున్ తో కోటా శ్రీనివాసరావు చేసిన సినిమాలు..
ఇక కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన ఈ ముగ్గురు హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.అల్లు అర్జున్ తో జులాయి (Julayi), సన్ ఆఫ్ సత్యమూర్తి(S/O Sathyamurthi), రేసుగుర్రం(Resu Gurram) వంటి సినిమాలు చేశారు.
ఎన్టీఆర్ – కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు..
ఎన్టీఆర్ తో సింహాద్రి(Simhadri), బృందావనం, రాఖీ, దమ్ము(Dammu) వంటి సినిమాల్లో చేశారు.
మహేష్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకున్న కోటా..
ఇక మహేష్ బాబుతో నాని, సైనికుడు, దూకుడు (Dookudu),ఖలేజా (Khaleja),మహర్షి (Maharshi), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Sithamma Vakitlo Sirimalle chettu) లాంటి సినిమాలు చేశారు.
also read:Kota Srinivas Rao: తెలుగు కాకుండా కోటా నటించిన ఇతర భాషా చిత్రాలివే!