Big Tv Kissik Talks: బిగ్ టీవీ(Bigg Tv)లో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ టీవీ కిసిక్ టాక్స్ (Bigg Tv Kissik Talks)కార్యక్రమం ఒకటి. జబర్దస్త్ వర్ష (Varsha)యాంకర్ గా వ్యవహరిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. ప్రతి వారం బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమంలో హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ వారం ఈ కార్యక్రమానికి దీపిక రంగరాజు(Deepika Rangaraju) హాజరయ్యారు. దీపికా రంగరాజు అంటే బహుశా గుర్తుపట్టకపోవచ్చు కానీ బ్రహ్మ ముడి (Bramhamudi)కావ్య(Kavya) అంటే మాత్రం అందరికీ తక్కున ఈమె గుర్తుకు వస్తారు. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీపిక ఇటీవల పెద్ద ఎత్తున తెలుగు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.
బ్రహ్మముడితో గుర్తింపు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీపిక తన కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఇక బ్రహ్మముడి సీరియల్ తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని తెలిపారు. అప్పటివరకు నేను ఇండస్ట్రీలోనే ఉన్నా, ఎన్నో తమిళ సీరియల్స్, సినిమాలు కూడా చేశాను కానీ గుర్తింపు రాలేదని, బ్రహ్మ ముడి సీరియల్ తర్వాతనే తనకు మంచి గుర్తింపు లభించిందని దీపిక వెల్లడించారు.
జబర్దస్త్ యాంకర్ గా పని చేస్తా…
ఇక బ్రహ్మముడి సీరియల్ లో మానస్ గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడారు. మానస్ (Manas)చాలా అద్భుతమైన నటుడు, మంచి డాన్సర్ అని తెలిపారు. మానస్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం.. అదే సీరియల్లో రాజ్ గా కావ్య జీవితంలోకి రావడం అదృష్టం అంటూ మాట్లాడారు. నిజంగా మానస్ లాంటి భర్త దొరకడం శ్రీజ అదృష్టం అంటూ తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె ఎక్కువగా మానస్ గురించి మాట్లాడారు. ఇక ప్రస్తుతం మానస్ జబర్దస్త్ యాంకర్ (Jabardasth Anchor) గా పనిచేస్తున్నారు కదా ఎలా అనిపించింది అంటూ వర్ష ప్రశ్నించింది. చాలా అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారని ఏదో ఒక రోజు నేను కూడా మానస్ తో కలిసి ఆ కార్యక్రమంలో యాంకర్ గా చేయాలి అంటూ ఈమె తనలో ఉన్న కోరికను బయటపెట్టింది.
రష్మీ మీరు కొద్ది రోజులపాటు ఎక్కడైనా వెకేషన్ వెళ్లిపోండి నేను మానస్ కలిసి జబర్దస్త్ యాంకర్స్ గా చేస్తాము అంటూ ఈ సందర్భంగా రష్మీకి కూడా దీపిక సలహాలు ఇచ్చారు. ఇక బ్రహ్మముడి సీరియల్ చేస్తూ తమిళంలో కూడా సీరియల్స్ చేయాలనుకున్నాను కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను తమిళం వైపు వెళ్ళనివ్వలేదని, అంతలా నన్ను ఆదరించడంతో నాకు ఇక్కడే మంచి అవకాశాలు వస్తున్నాయి అంటూ దీపిక తెలియచేశారు. ఇక బ్రహ్మముడి సీరియల్ లో చేయాలా వద్దా అంటూ ఎంతోమంది జ్యోతిష్యులను అడిగి తెలుసుకున్నానని ఈ సీరియల్ లో ఛాన్స్ కోసం సుమారు పదివేల రూపాయల వరకు కూడా ఖర్చు చేశానని తెలిపారు. జ్యోతిష్యులు చేస్తే మంచి పేరు వస్తుందని చెప్పిన తర్వాతే బ్రహ్మముడి సీరియల్ కి కమిట్ అయ్యాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
Also Read: Fathima Sana Shaikh: ఆ వ్యక్తి అసభ్యంగా తాకాడు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి?