The Girl Friend: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend). ఈ సినిమా అతి త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది అయితే తాజాగా ఈ సినిమా తాజాగా ‘నదివే’ (Nadhive)అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో రష్మిక దీక్షిత్ రొమాంటిక్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నదివే సాంగ్ రిలీజ్…
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు కలిసి నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ రెండు బడా సంస్థలు కలిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అతి త్వరలోనే షూటింగ్ పనులు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది.
భావోద్వేగమైనది…
ఇక ఈ పాట విడుదలైన సందర్భంగా రష్మిక ఈ పాటను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టు చేశారు.”ఈ పాటను నేను మొదటిసారి విన్నప్పటి నుంచి ఆ పాట దగ్గరే ఆగిపోయానని, ఇది ఎంతో మృదువైన, భావోద్వేగ మైనదని తెలియజేశారు. ఈ పాట విన్న తర్వాత మీకు తెలియకుండానే మీరు కూడా ఈ పాటను హమ్ చేస్తూ ఉంటారని తెలిపారు. ఈ పాట షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రతి ఫ్రేమ్ కాలంలో స్తంభించిపోయిన క్షణంలా అనిపించింది. ఈ పాట విన్న తర్వాత మీ హృదయంలో కూడా అలాగే అనిపిస్తే నాకు తెలియచేయండి ” అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
From the very first time I heard it, something about it just stuck..
It’s soft, it’s emotional, it’s that kind of melody you hum without realising and now it’s yours 💛I remember feeling like I was in a little film inside the film when we were shooting this one.. every frame… pic.twitter.com/aQGoGw8f90
— Rashmika Mandanna (@iamRashmika) July 16, 2025
ఇక ఈ పాటలో రష్మిక రొమాంటిక్ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇటీవల కాలంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న రష్మిక మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన ఈమె త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం రష్మిక మైసా అనే సినిమాలో నటిస్తున్నారు అదే విధంగా అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఈమె విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఇదివరకు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా రష్మిక క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.