BigTV English

CM Revanth Reddy: బనకచర్లపై నో డిస్కషన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: బనకచర్లపై నో డిస్కషన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించగా.. తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో ప్రతిపాదించింది. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.


బనకచర్లపై ఎలాంటి ప్రస్తావన రాలేదు: సీఎం రేవంత్

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘అపెక్స్ కమిటీ మీటింగ్ కాదు. కేవలం ఫార్మల్ మీటింగ్. బనకచర్ల ఆపమనడానికి అసలు కడతామన్న చర్చనే మీటింగ్ లో రాలేదు. గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేనా నిర్ణయం తీసుకున్నాం. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావన ఏమీ రాలేదు. ఇరు రాష్ట్రాల నీటి వినియోగంపై సమావేశంలో చర్చించాం. ప్రాజెక్టుల నిర్వహణపైనా సమావేశంలో చర్చకు చర్చించాం. జలాల వాటా, కొత్త ప్రాజెక్టుల అంశాలన్నీ కమిటీ ముందు చర్చకు వస్తాయి. నిర్మాణంలో ఉన్నవి, కొత్తవి, పాత ప్రాజెక్టులు కమిటీ ముందు చర్చకు వస్తాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఇదంతా కేసీఆర్ వల్లే..

కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రాకు దారాధత్తం చేశారు. గత పాలకుల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కేంద్ర మధ్యవర్తిగా సమావేశం నిర్వహించింది. అసలు బనకచర్లపై సమావేశంలో చర్చించలేదు. కృష్ణా, గోదావరి నదుల ఉపనదులు, వాటి కేటాయింపుల గురించి చర్చించాం. తెలంగాణ చెప్పడం వల్లే ఈ సమావేశం జరిగింది. ఇది మా సక్సెస్. టెలిమెట్రీలకు ఏపీ ఒప్పించాం. శ్రీశైలం రిపేర్లకు అంగీకరించంది’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ణా బోర్డు: ఉత్తమ్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి వివరించారు. కృష్ణా నదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. టెలిమెట్రీలు ఉంటే ఏ రాష్ట్రం ఎంత మేర నీరు వాడుతుందో స్పష్టం తెలుస్తుందని అన్నారు. ‘కృష్ణా నది అన్ని పాయింట్స్ వద్ద యుద్ధప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిమెట్రీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించింది. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఏపీకి సూచించిందని వివరించారు. హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ALSO READ: Banakacharla: బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు: మంత్రి నిమ్మల

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×