Sara – Gill: టీమిండియా యంగ్ బ్యాటర్, నూతన కెప్టెన్ శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి రెండు సిరీస్ లలో సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీలు ఉన్నాయి. లీడ్స్ లో సెంచరీ, బర్మింగ్ హమ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదాడు. దీంతో రాహుల్ ద్రావిడ్ 23 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. ఇంగ్లాండ్ లో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా గిల్ రికార్డులకెక్కాడు. కానీ లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు.
క్రికెటర్లకు యువరాజ్ సింగ్ పార్టీ:
అయితే ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో ప్రస్తుతం గిల్ లండన్ లో ఉన్నాడు. మూడవ టెస్ట్ కి ముందు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లండన్ లో ఓ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి టీమిండియా క్రికెటర్లతో పాటు మాజీలు కూడా హాజరయ్యారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఈ పార్టీకి ప్రత్యేకంగా హాజరయ్యాడు. సచిన్ తో పాటు ఆయన భార్య అంజలి, కూతురు సారా కూడా వచ్చారు. అదే పార్టీలో గిల్ కూడా ఉండడంతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే చాలాకాలంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. గిల్ ఆడే మ్యాచ్ లకు స్టేడియంలో సారా హాజరు కావడం, అతడి బ్యాటింగ్ టైం లో చెప్పట్లు కొడుతూ ఆమె ఎంకరేజ్ చేయడం అప్పట్లో వైరల్ గా మారింది. అలాగే ప్రైవేట్ కార్యక్రమాలలో వీరిద్దరూ సీక్రెట్ గా కలుసుకోవడం, గిల్ సోదరితో సారా టెండూల్కర్ నైట్ పార్టీలకు వెళ్లిన వీడియోలు.. గిల్ – సారా టెండూల్కర్ డేటింగ్ రూమర్స్ కి బలం చేకూర్చాయి. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు అటు టెండూల్కర్ ఫ్యామిలీ కానీ.. గిల్ కుటుంబం కాని స్పందించలేదు.
Also Read: Rohit Sharma – London: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ దంపతులు.. ఇండియాకు గుడ్ బై?
ఇక ఇటీవల యువరాజ్ సింగ్ ఇచ్చిన పార్టీకి హాజరైన టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, గిల్, రిషబ్ పంత్.. పక్కపక్కనే కూర్చున్నారు. వీరు కూర్చున్న టేబుల్ కి కొంత దూరంలోనే సచిన్ టెండూల్కర్ ఆయన కుటుంబంతో కూర్చున్నాడు. అదే సమయంలో గిల్ అటువైపుగా చూసి నవ్వాడు. దీంతో రవీంద్ర జడేజా కళ్ళు ఎగరేస్తూ ఓ రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఏదో అనడంతో.. గిల్, అతడి పక్కనే ఉన్న కే.ఎల్ రాహుల్ కూడా నవ్వారు. దీంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజెన్లు రచ్చ రచ్చ చేశారు.
గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా?
తాజాగా సారా టెండూల్కర్ కి సంబంధించిన మరో వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ క్రికెటర్ కి సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది సారా టెండూల్కర్. సీక్రెట్ గా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి హెల్మెట్, బ్యాట్ పక్కన కూర్చుని ఫోటో దిగింది. అయితే ఈ వీడియోని వైరల్ చేస్తూ.. సారా.. గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిందని వైరల్ చేస్తున్నారు. కానీ గిల్ ఇప్పటికే తాను ఎవరితో ప్రేమలో లేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
?utm_source=ig_web_copy_link