 
					Nara Rohith – Sirisha : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, హీరోయిన్ సిరీ లెల్లా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అజీజ్‌నగర్‌లోని ‘ద వెన్యూ కన్వెన్షన్’లో జరిగిన ఈ వేడుక ఘనంగా సాగింది. నటుడు నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యారు. నటి సిరీ లెల్లా (సిరి) తో ఆయన వివాహం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరై అయ్యారు. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో నారా కుటుంబంలో ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.. అజీజ్‌నగర్‌లోని ‘ద వెన్యూ కన్వెన్షన్’లో జరిగిన ఈ వేడుక ఘనంగా సాగింది. కొత్త దంపతులు నారా రోహిత్, శిరీషలను ఆశీర్వదించారు. సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన కొత్త జంటను ఆశీర్వదించారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నిహితులు, మిత్రులు, సినీ-రాజకీయ ప్రముఖులు కూడా రోహిత్, శిరీషలను ఆశీర్వదించారు..
ప్రతినిధి 2’ సినిమాలో రోహిత్ సరసన సిరీ లెల్లా నటించారు. అలా మొదలైన వారి స్నేహం.. ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో గతేడాది వీరి నిశ్చితార్థం జరిగింది. సిరీ లెల్లా స్వస్థలం ఏపీలోని రెంటచింతల. తమ తల్లిదండ్రులకు నాలుగో సంతానమైన శిరీష.. ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో స్వదేశానికి తిరిగొచ్చారు. హైదరాబాద్‌లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ చేసిన సినీ ప్రయత్నాల్లో భాగంగా ‘ప్రతినిధి 2’కి ఎంపికయ్యారు.. ఆ సినిమాలో నటించారు ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇక గతేడాది కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్నారు.. ఇక నిన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.. వీరి పెళ్లి ఫోటోలను ఒకసారి చూసేయండి..
హీరో #NaraRohit ఓ ఇంటివాడయ్యారు. నటి #Sireesha తో ఆయన వివాహం గురువారం రాత్రి ఘనంగా జరిగింది.
ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. #NaraRohitMarriage pic.twitter.com/sFQUG6sdLy— BIG TV Cinema (@BigtvCinema) October 31, 2025