 
					Chiranjeevi Deep Fake Case : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గత కొన్ని రోజులుగా డీప్ ఫేక్ వీడియోలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన పేరును, ఫోటోలను ఉపయోగించుకొని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అంటూ వీసీ సజ్జనార్ ను ఆశ్రయించారు. ఆ తర్వాత సిటీ సివిల్ కోర్టును కూడా ఆశ్రయించి పిటిషన్ వేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంపై స్పందించిన వీసీ సజ్జనార్ ఎవరైనా చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఉపయోగించినట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా వేదికగా స్పష్టం చేశారు. అలాగే సిటీ సివిల్ కోర్టు కూడా ఈ విషయంపై చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ కొంతమంది మళ్ళీ ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడమే కాకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ పోస్ట్లు పెట్టడంతో మళ్లీ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండడంతో తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు మళ్లీ వార్నింగ్ ఇచ్చినా సరే ఆయన ఫోటోలను వాడుతున్నట్లు ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్ మండిపడుతూ..” మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాము. డీప్ ఫేక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టాము. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురి కావొద్దు. ప్రజలలో ఎంతో అవగాహన తీసుకొస్తున్నాము. డిజిటల్ అరెస్టు ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారు. పిల్లలు 5000, 10,000 కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారు. దీనివల్ల మీరు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది *అంటూ ఆయన తెలిపారు.
ALSO READ:Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!
అలాగే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సస్పెండ్ పై కూడా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్ ను సస్పెండ్ చేశాము. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. ఉప్పలపాటి సతీష్ పై సిఐడి, జిఎస్టి కేసులు ఉన్నాయి. నిందితుల కోసం ప్రత్యేకమైన టీం ని కూడా ఏర్పాటు చేశాము. త్వరలోనే నిందితులను పట్టుకుంటాము” అంటూ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పటికైనా చిరంజీవికి సంబంధించి ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయేమో చూడాలి. ఇకపోతే ఇప్పటికే ఆయనకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా డిలీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్లో తన 158వ చిత్రానికి గురించి సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా డిసెంబర్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.