 
					PM Modi: దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకునే జాతీయ ఐక్యత దినోత్సవం (National Unity Day).. ఈ సారి మరింత ఉత్సాహభరితంగా సాగుతోంది.
ఢిల్లీలో రన్ ఫర్ యూనిటీ ప్రారంభం
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం నుంచి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా (Ekta Nagar) లోని.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ పటేల్‌కు నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహం వద్ద ప్రధానమంత్రికి రక్షణ, సాంస్కృతిక శాఖలు ఘన స్వాగతం పలికాయి. భారత వాయుసేన విమానాలు సర్దార్ పటేల్ విగ్రహంపై.. పూల వర్షం కురిపించారు.
కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే తరహాలో ప్రతి సంవత్సరం ఈ పరేడ్ కొనసాగనుంది. ఈ పరేడ్‌లో గుజరాత్, అస్సాం, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. అదేవిధంగా బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి, ఎన్‌సిసి బృందాలు కూడా పాల్గొంటున్నాయి.
భారతదేశ తొలి ఉప ప్రధాని, తొలి కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్.. దేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర అపూర్వమైనది. ఆయన చేసిన కృషి వల్లే దేశం రాజకీయంగా, భౌగోళికంగా ఏకతా సాధించగలిగింది. గాంధీజీ ఆయనను భారతదేశ ఉక్కు మనిషి అని ప్రశంసించారు.
Also Read: ఖమ్మం జిల్లాలో సీపీఎం నేత దారుణ హత్య
దేశవ్యాప్తంగా ఐక్యత పరుగు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఐక్యత పరుగు (Run for Unity) ఉత్సాహంగా జరిగింది.