 
					Oils For Hair Growth: జుట్టు ఆరోగ్యంగా.. ఒత్తుగా పెరగడానికి సరైన పోషణ చాలా అవసరం. రాత్రి నిద్రపోయే ముందు తలకు నూనెతో మసాజ్ చేయడం అనేది మన సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఒక చక్కటి పద్ధతి. రాత్రంతా నూనె జుట్టు కుదుళ్ళలోకి చొచ్చుకుపోయి.. పోషణ అందించి, మరుసటి రోజు జుట్టును శుభ్రం చేసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి రాత్రిపూట అప్లై చేయదగిన 5 బెస్ట్ ఆయిల్స్, వాటి ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి నూనె :
కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోయి, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. అంతే కాకుండా స్కాల్ప్‌ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
రాత్రిపూట ఎలా వాడాలి: కొద్దిగా కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి.. కుదుళ్లకు మెల్లగా మసాజ్ చేయండి. దీనిని రాత్రంతా ఉంచి, ఉదయం షాంపూతో శుభ్రం చేసుకోండి.
2. ఆముదం నూనె:
ఆముదం నూనెలో రిసినోలిక్ ఆమ్లం, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తలకు రక్త ప్రసరణను పెంచి, నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
రాత్రిపూట ఎలా వాడాలి: ఆముదం నూనె చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి. దీన్ని కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి ఇతర నూనెలతో కలిపి మాత్రమే వాడాలి (ఉదా: 1 భాగం ఆముదం నూనె, 2 భాగాల కొబ్బరి నూనె). రాత్రంతా ఉంచి.. ఉదయం తలస్నానం చేయాలి.
3. రోజ్మేరీ ఎన్నికల ఆయిల్:
జుట్టు పెరుగుదలకు ఇది ఒక అద్భుతమైన ఎసెన్షియల్ ఆయిల్. రోజ్మేరీ నూనె తలలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఇది వెంట్రుకలు రాలడాన్ని తగ్గించి.. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
రాత్రిపూట ఎలా వాడాలి: రోజ్మేరీ ఆయిల్‌ను నేరుగా తలకు అప్లై చేయకూడదు. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి లేదా జోజోబా నూనెలో కేవలం 3-5 చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి మసాజ్ చేసి.. రాత్రంతా ఉంచడం మంచిది.
4. బాదం నూనె :
బాదం నూనెలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్ళకు పోషణను అందించి.. తలపై మంటను తగ్గిస్తుంది. దీనిలోని కొవ్వు ఆమ్లాలు జుట్టుకు మెరుపునిచ్చి, మృదువుగా ఉండేలా చేస్తాయి.
రాత్రిపూట ఎలా వాడాలి: కొద్దిగా బాదం నూనె తీసుకుని.. జుట్టు చివర్లకు, స్కాల్ప్‌కు అప్లై చేసి, రాత్రంతా ఉంచవచ్చు. ఇది తేలికగా ఉంటుంది కాబట్టి.. సులభంగా తలస్నానం చేయవచ్చు.
Also Read: ముఖం అందంగా మెరిసిపోవాలా ? అయితే ఇవి ట్రై చేయండి
5. ఉల్లి నూనె:
ఉల్లి నూనెలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన కెరాటిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది. ముఖ్యంగా.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలపరుస్తుంది.
రాత్రిపూట ఎలా వాడాలి: వాసన కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఉల్లి నూనెను (ఇతర క్యారియర్ నూనెలతో కలిపిన) తలకు మసాజ్ చేసి, కనీసం 30 నిమిషాల నుంచి రాత్రంతా ఉంచి, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ముఖ్యమైన చిట్కా:
ఈ నూనెలను వారానికి 2 నుంచి 3 సార్లు క్రమం తప్పకుండా వాడటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. రాత్రిపూట ఆయిలింగ్ చేసేటప్పుడు.. మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి, జుట్టు పెరుగుదల మరింత వేగవంతం అవుతుంది.