E-Paper
Advertisement

The Raja Saab: ది రాజా సాబ్ నటీనటుల రెమ్యూనరేషన్.. ఎవరికి ఎంతంటే?

The Raja Saab: ది రాజా సాబ్ నటీనటుల రెమ్యూనరేషన్.. ఎవరికి ఎంతంటే?
Advertisement

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) త్వరలోనే ది రాజా సాబ్ (The Raja Saab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది.

రెమ్యూనరేషన్ల వివరాలు..

ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు తీసుకున్న రెమ్యూనరేషన్లకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలో నటించిన ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ వంటి తదితరులు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయానికి వస్తే..

Advertisement

ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు కానీ రాజా సాబ్ సినిమా కోసం ఈయన కేవలం 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది.

మాళవిక మోహనన్: ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న వారిలో ఒకరైన మాళవిక మోహనన్ మొదటిసారి ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించినందుకు ఈమెకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందించినట్టు తెలుస్తుంది.

Advertisement

నిధి అగర్వాల్: ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ 1.2- 1.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు.

రిద్ధి కుమార్: రాజా సాబ్ సినిమాలో మరో హీరోయిన్ రిద్ది కుమార్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కోసం ఈమె ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.

సంజయ్ దత్:  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రభాస్ తాతయ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 5- 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నారు. అందుకుగాను ఈయన 80 లక్షలు, మరో నటుడు అనుపమ ఖేర్ ఒక కోటి, డైరెక్టర్ మారుతి 18 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా హార్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Poonam Kaur: నాకు పెళ్లి.. అబార్షన్లు కూడా జరిగాయి.. రహస్యంగా పిల్లలు..

Related News

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×