Singer Chinmayi:గాయని, సంగీత విద్వాంసురాలు, భాషా శాస్త్రవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది చిన్మయి. టీవీ హోస్ట్ గా , ఆర్జేగా కూడా పనిచేసిన చిన్మయి ఒకవైపు సినిమా పాటలు పాడడమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు గాత్రదానం చేసి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే నిత్యం సామాజిక అంశాలపై స్పందిస్తూ.. విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే ఈమె.. ఆడవారిపై, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు, తప్పుడు కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం తనదైన శైలిలో లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటుంది. తప్పని తెలిస్తే ఎంతటి పోరాటానికైనా దిగే చిన్మయి.. తనపై ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం అంతే వేగంగా రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్న ఒక వీడియో పై తనదైన శైలిలో స్పందించింది సింగర్ చిన్మయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తి చెందుతోందని, తప్పుడు ప్రచారాలకే జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఎక్స్ లో వైరల్ అయిన ఒక పోస్టును ఆమె ప్రస్తావిస్తూ.. అసలు నిజం ఏంటో తెలుసుకోకుండా చేసే ప్రచారాలు ప్రజలపై ఏ విధంగా చెడు ప్రభావాన్ని చూపుతున్నాయో ఆమె స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక వీడియో మెసేజ్ ను తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.. గత రెండు మూడు రోజుల క్రితం వరాహ వారియర్ అనే ఒక అకౌంట్లో ఒక యువకుడు గర్భగుడిలో సిగరెట్టు వెలిగిస్తున్న వీడియోని పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియోకి.. వాస్తవాలకు బిన్నంగా ఉండే విషయాలను జోడించి ప్రచారం చేశారు.
అయితే దీనిపై చిన్మయి స్పందించింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. వీడియోలో కనిపించిన వ్యక్తి గురించి, పోస్టులో చేసిన ప్రచారం ఏమాత్రం నిజం కాదు. అప్పట్లో ఈ ఘటనపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్న దానిపై నా దగ్గర పూర్తి వివరాలు లేవు. కానీ ఆ సమయంలో గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ఆ పోస్ట్ లోని సమాచారం తప్పని స్పష్టం చేసింది. అసలు పోస్టు ఇప్పటికీ ఇలాగే ఉంది. అయినా సరే ఆ పోస్టును కాదని ఇలా ఈ తప్పుడు సమాచారం ఉన్న పోస్టును మళ్లీ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ కి చాలా తక్కువ రెస్పాన్స్ రాగా.. తప్పుడు సమాచారం ఉన్న పోస్ట్ కి వేల సంఖ్యలో షేర్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే తప్పుడు సమాచారమే ఎక్కువ మందికి చేరి అది నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతోంది అంటూ చిన్మయి తనదైన శైలిలో అభిప్రాయపడింది. అంతేకాదు ఈ వీడియోలో ఆ పోస్టులో అప్పటి గవర్నమెంటు ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ షేర్ చేసిన అధికారిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను కూడా ఆమె ట్యాగ్ చేసింది.
also read:నాగార్జున తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?
ఇక అంతేకాదు ఈ వీడియో మెసేజ్ తో పాటు మరో పోస్ట్ షేర్ చేస్తూ తప్పుడు సమాచారం ఉన్న పోస్టును అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్ ఖండించినప్పటికీ.. దానిని ఇంకా డిలీట్ చేయలేదు. అలాగే అలాంటి పోస్టులపై కమ్యూనిటీ నోట్స్ కూడా కనిపించలేదు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వేగంగా గుర్తించి అడ్డుకునే సిస్టం మరింత కరెక్ట్ గా పని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలు నిజా నిజాలు తెలుసుకోకుండా క్రెడిబిలిటీ లేని సమాచారాన్ని షేర్ చేయకుండా సరైన విధంగా అంతా వ్యవహరించాలి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, వాటి సారాంశం.. నిజా నిజాలు తెలుసుకోకుండా.. దయచేసి ఇంకొకరికి షేర్ చేయకుండా ఉంటారేమో చూడాలి.
People who spread hate based on lies will have no action taken against them and here is proof.
The fake tweet of Varaha Warrior Fact Checked as Fake by the Ap Govt official handle and yet the tweet has not been taken down.
No community notes either. pic.twitter.com/1lI42kCo4K— Chinmayi Sripaada (@Chinmayi) July 9, 2026