E-Paper
Advertisement

ఆ ఒక్క సినిమా తెచ్చిన తంటా: రూ. 7.35 కోట్ల పెనాల్టీతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ కమెడియన్!

ఆ ఒక్క సినిమా తెచ్చిన తంటా: రూ. 7.35 కోట్ల పెనాల్టీతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ కమెడియన్!
Advertisement

Rajpal Yadav:రాజ్ పాల్ యాదవ్..తనదైన కామెడీ టైమింగ్ తో కోట్లాదిమందిని నవ్వించిన బాలీవుడ్ స్టార్ కమెడియన్.అలాంటి ఈ కామెడీ కింగ్ కి షాక్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు .ఆయనపై నమోదైన ఏడు చెక్ బౌన్స్ కేసులో కింది కోర్ట్ లు ఇచ్చిన  తీర్పును సమర్థిస్తూ జడ్జ్మెంట్ వదిలింది హైకోర్టు.జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసులో రాజ్ పాల్ యాదవ్  తీరును తప్పుపడుతూ ఆయనకి కోర్టు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు .

ఇక ఈ క్రమంలోనే ఒక్కొక్క కేసులో రూపాయలు ఒక్కో కేసులో రూ. 1.05 కోట్ల చొప్పున, మొత్తం ఏడు కేసులకు కలిపి ఏకంగా రూ. 7.35 కోట్ల భారీ పెనాల్టీని విధిస్తూ సంచల తీర్పునిచ్చారు .ఇక ఈ జరిమానా మొత్తంలో ప్రతి కేసు నుండి ప్రతి కేసు నుండి రూ. 1.04 కోట్లు ఫిర్యాదుదారునికి, రూ. 25 వేలు ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది.అయితే ఈ జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి హైకోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది .

Advertisement

also read:వరుణ్ తేజ్ వైల్డెస్ట్ కంబ్యాక్ డేట్ ఫిక్స్…వరుస ప్లాపులకి బ్రేక్ పడేనా?

అమితాబచ్చన్ లీడ్ రోల్ లో ‘అతా పతా లపతా’

Advertisement

ఇక ఈ వివాదం వెనుక అసలు సంగతి ఏంటంటే… 2010లో రాజ్‌పాల్ యాదవ్ దర్శకుడుగా మారి ప్రముఖ నటుడు అమితాబచ్చన్ లీడ్ రోల్ లో ‘అతా పతా లపతా’ అనే పొలిటికల్ సెటైర్ సినిమాని నిర్మించాలని ప్లాన్ చేశాడు.ఇక ఆ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ‘మెసర్స్ మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆయన 5 కోట్ల లోను తీసుకున్నాడు కూడా.అయితే 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా మిగిలింది.సినిమా ప్లాఫ్ అవడంతో రాజ్‌పాల్ యాదవ్ ఆర్ధిక కష్టాల్లో  మునిగిపోయాడు.

రాజ్‌పాల్ యాదవ్ ని దోషిగా తెలుస్తూ 2024లో శిక్ష

ఇక తీసుకున్న అప్పును తిరిగి కట్టడంలో ఇబ్బందులు పడటంతో ‘మెసర్స్ మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఆయన ఇచ్చిన  చెక్కులన్నీ బౌన్స్ అయిపోయాయి.దీంతో ఆ సంస్థ2013-14 కాలంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద  రాజ్‌పాల్ యాదవ్ పై కోర్టులో కేసు వేసింది .ఇక అప్పటినుండి న్యాయపోరాటం చేస్తుండగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద రాజ్‌పాల్ యాదవ్ ని దోషిగా తెలుస్తూ 2024లో శిక్ష విధించింది.అయితే అప్పటినుండి ఆయన ఈ శిక్షపై స్టే ఈ శిక్షపై స్టే కోరుతూ ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్లు వేస్తూనే ఉన్నాడు.ఆ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు అతడిపై మండిపడింది.కోర్టుకు ఇచ్చిన హామీలను, పేమెంట్ తేదీలని లెక్క చేయకపోవడంతో జైలు సూపరింటెండెంట్ ముందులొంగి పోవాలని అప్పట్లోనే ఆదేశించింది.

ఈ స్టార్ కమెడియన్ ఎలాంటి రిలీఫ్ పొందుతాడో !

అయితే ఆ తర్వాత రాజ్‌పాల్ యాదవ్ కొంత సెటిల్మెంట్ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయడంతో హైకోర్టు ఆయన శిక్షపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది.అయితే తాజాగా విచారణ సందర్భంగా రాజ్‌పాల్ యాదవ్ లాయర్  మాట్లాడుతూ ఇప్పటికే మురళీ ప్రాజెక్ట్స్ కి రూ. 4.25 కోట్లు చెల్లించామని తాజాగా రూ. 25 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్‌ను కూడా కోర్టుకు సమర్పించామని చెప్పుకొచ్చాడు.దీంతో రాజ్‌పాల్ యాదవ్ ని జైలుకు పంపడానికి తాము ఇష్టంగా లేమని తెలిపారు జడ్జ్.అలాగే రాజ్‌పాల్ యాదవ్  బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు చేసిన దరఖాస్తు కూడా కోర్టు తిరస్కరించింది.ఆయన ఎక్కడికి పారిపోవడం లేదని ఇక్కడే ఉన్నాడని రావాల్సిన డబ్బు కచ్చితంగా వస్తుందని చెప్పుకొచ్చింది.మొత్తానికి 7.35 కోట్ల భారీ పెనాల్టీ రాజు యాదవ్ కి తలనొప్పిగా మారిపోయింది .

చూడాలి మరి వచ్చే రెండు నెలల్లో సుప్రీంకోర్టులో ఈ స్టార్ కమెడియన్ ఎలాంటి రిలీఫ్ పొందుతాడో !

Related News

తండ్రి చనిపోయిన రోజే ఆ పని.. ‘రక్తకన్నీరు’ నాగభూషణం లైఫ్‌లో ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

తండ్రిని పట్టుకొని ఏడ్చేసిన అఖిల్.. వీడియో వైరల్!

శోభన్ బాబు తన కొడుకును హీరోగా చేయకపోవడానికి కారణం?

తప్పుడు ప్రచారమే వేగంగా వ్యాప్తి చెందుతోందా.. వైరల్ వీడియోపై చిన్మయి ఫైర్!

వరుణ్ తేజ్ వైల్డెస్ట్ కంబ్యాక్ డేట్ ఫిక్స్…వరుస ప్లాపులకి బ్రేక్ పడేనా?

ప్రభాస్ ‘ఫౌజీ’ థియేట్రికల్ డీల్స్ క్లోజ్…దక్కించుకుంది ఎవరో తెలుసా ?

నాగార్జున తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×