Akhil:అఖిల్ అక్కినేని తన తండ్రి కాళ్లపై పడి ఏడ్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. గత మూడు ఏళ్ల క్రితం ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఈసారి ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలి అని చాలా కష్టపడి మరీ లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నారు. పైగా ఈ సినిమా కోసం అఖిల్ పడుతున్న ఆరాటం అంతా కనిపించింది . పైగా ఆయన కష్టం తెరపై వెల్లివిరిసింది. ఎప్పుడూ చాక్లెట్ బాయ్ లా కనిపిస్తూ అందరిని ఆకట్టుకునే అఖిల్ ఒక్కసారిగా ఊర మాస్ గెటప్లో కనిపించి అందరిని మెస్మరైజ్ చేశారు.
తనలోనూ నటుడు ఉన్నాడు అని నిరూపించాడు. ఇక లెనిన్ మూవీ స్టోరీను కాస్త పక్కన పెడితే.. ఇందులో అఖిల్ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. పైగా లెనిన్ కి పాజిటివ్ టాక్ రావడంతో..చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో తన తాతయ్య, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు తన తండ్రి నాగార్జున కాళ్ల మీద పడి.. అనంతరం తన తండ్రిని హగ్ చేసుకుని చిన్నపిల్లడిలా ఏడ్చేసాడు అఖిల్. దాంతో నాగార్జున కూడా ఎమోషనల్ అయ్యారు. అలా తన తండ్రిని హత్తుకొని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది . సక్సెస్ ఇచ్చిన ఆనందం ఇలా ఉంటుంది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు .మొత్తానికైతే అఖిల్ లెనిన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ సక్సెస్ ను ఆయన కన్నీళ్ళ రూపంలో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లెనిన్ విషయానికి వస్తే.. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా వచ్చిన ఈ సినిమా జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకి ఎటువంటి ప్రీమియర్ షోలు పడకుండా నేరుగా నేడు థియేటర్లలోకి వచ్చేసింది ఈ సినిమా. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటానని చెప్పిన అఖిల్.. అందుకు తగ్గట్టుగానే తన నటనతో ఆకట్టుకున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
also read:శోభన్ బాబు తన కొడుకును హీరోగా చేయకపోవడానికి కారణం?
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ ఆ తర్వాత హలో, అఖిల్ వంటి చిత్రాలతో హీరోగా మారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆయనకు గుర్తింపు లభించలేదు. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నేడు లెనిన్ తో లభించింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.