E-Paper
Advertisement

తండ్రి చనిపోయిన రోజే ఆ పని.. ‘రక్తకన్నీరు’ నాగభూషణం లైఫ్‌లో ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

తండ్రి చనిపోయిన రోజే ఆ పని.. ‘రక్తకన్నీరు’ నాగభూషణం లైఫ్‌లో ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!
Advertisement

Nagabhushanam Biography:తెలుగు సినీ ఇండస్ట్రీలో విలనిజానికి గ్లామర్ నేర్పిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా నాగభూషణమే.నాగభూషణం అనేదాని కన్నారక్త కన్నీరు నాగభూషణం అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఒక విలనిజమే కాకుండా ఆ విలనిజంలో కామెడీ మరియు కన్నింగ్ సెటైర్లతో విలన్ పాత్రలకే కొత్త నిర్వచనం ఇచ్చాడు నాగభూషణం.

నాగభూషణం విషయానికి వస్తే… 1922 మార్చి 19న జన్మించిన చుండి నాగభూషణం చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగాడు .ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత పై చదువులకు డబ్బు కష్టాలు అడ్డు రావడంతో ఉద్యోగం చేయక తప్పలేదు .అలా సరిగా 1942లో ఆయన తండ్రి మరణించిన రోజు మద్రాస్ రైల్వే శాఖ నుంచి నెలకు పాతిక రూపాయల జీతంతో కూడిన ఉద్యోగానికి కాల్ లెటర్ వచ్చింది. అయితే తండ్రి కర్మదిన కార్యక్రమాలను వదిలిపెట్టి మరి ఆ ఇంటర్వ్యూకి హాజరై ఉద్యోగంలో చేరాడు నాగభూషణం.ఇక అక్కడ తోటి ఉద్యోగులు వేసే నాటకాలు చూసి ఆయనకు నటనపై ఆసక్తి ఎక్కువైంది.

Advertisement

1951లో వచ్చిన ‘పల్లెటూరు’ సినిమాతో

ముఖ్యంగా మద్రాస్ లో జీ వరలక్ష్మి, మిక్కిలినేని వంటి ప్రముఖుల పరిచయం ఆయన జీవితాన్నిమలుపు తిప్పిందని చెప్పాలి.ప్రజానాట్యమండలితో కలిసి ఆత్రేయ రాసిన ‘భయం’, ‘కప్పలు’ వంటి నాటకాలు ఆయనకి మంచి పేరు తెచ్చాయి.1951లో వచ్చిన ‘పల్లెటూరు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగభూషణం ఆ తర్వాత ‘పెంకి పెళ్ళాం’ లో తాగుబోతుగా ‘అమర సందేశం’లో విలన్ గా నటించి మెప్పించారు.ఇక 1956లో తన బాల్య స్నేహితుడు ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన ఏది నిజం సినిమాతో హీరోగా రాష్ట్రపతి బహుమతి అందుకున్నప్పటికీ సరైన అవకాశాలు దక్కించుకోలేదు నాగభూషణం.

Advertisement

పైగా హీరోగా నటించిన వాడికి మామూలు వేషాలు ఎలా ఇవ్వాలని  ఆయనను కొంతకాలం పక్కన పెట్టింది సినిమా ఇండస్ట్రీ .అయితే అదే సమయంలో మాయాబజార్ వంటి  సినిమాల్లో చిన్న పాత్రలు వేస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని కొనసాగించాడు నాగభూషణం .అయితే 1961 లో వచ్చిన ‘శభాష్ రాజా’ సినిమా  ఆయన కెరీర్ ని మలుపు తిప్పింది.దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘మంచి మనసులు’ (1962) సినిమాలో  తమిళ నటుడు ఎమ్.ఆర్. రాధా చేసిన విలక్షణమైన పాత్రని నాగభూషణం పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక ఆపై ‘మూగమనసులు’, ‘ఉమ్మడి కుటుంబం’ (1967) సినిమాలతో మోస్ట్ బిజీగా మారిపోయాడు నాగభూషణం .

1956 మే నెలలో నెల్లూరులో తొలి ప్రదర్శన

ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నాగభూషణం అనే పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది రక్త  కన్నీరు నాటకం.తమిళంలోఎమ్.ఆర్. రాధా ప్రదర్శించిన నాటకం చూసి ఇన్స్పైర్ అయిన నాగభూషణం రచయిత పాలగుమ్మి  పద్మరాజుతో తెలుగులో రాయించుకొని 1956 మే నెలలో నెల్లూరులో తొలి ప్రదర్శన ఇచ్చాడు. నాభిలోంచి శ్వాస తీసుకుంటూ మాటిమాటికి రామా అంటూ ఏడ్చే ఎమ్.ఆర్. రాధా ని ఇమిటేట్ చేస్తూ తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాడు నాగభూషణం.అలా ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జూన్ వరకు నెలకు కనీసం 25 ప్రదర్శనలు ఇస్తూ వర్షాకాలంలో మాత్రమే బ్రేక్ ఇచ్చేవారు.

ఒక నెలలో 32 ప్రదర్శనలు, 1959లో కాకినాడలో వరుసగా 14 రోజులపాటు ప్రదర్శనలు ఇచ్చి రికార్డు సృష్టించాడు.’రవి ఆర్ట్ థియేటర్స్’ ని నమ్ముకుని దాదాపు 30 నాటక కళాకారుల కుటుంబాలు జీవనం సాగించాయంటే నాగభూషణం నాటకాలపై ఎంతగా ఫోకస్ పెట్టేవాడో అర్థమవుతుంది.ఇక వాణిశ్రీ ,శారద, రేవతి, మీనా కుమారి ,సుజాత వంటి వారు ఈ నాటక సంస్థ నుంచి తెరపైకి  వచ్చినవారే.

ఆయన ఇంటి పేరును ఏకంగా రక్త కన్నీరు

ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రతి నెల మొదటి వారాన్ని నాటకం కోసం కేటాయించేవారు.అలా మొత్తంగా 5500 పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకున్న ఈ నాటకం ఆయన ఇంటి పేరును ఏకంగా రక్త కన్నీరు నాగభూషణంగా మార్చేసింది.మరోవైపు సినిమాలో పౌరాణిక పాత్రలైన శివుడు (భూకైలాస్), సాత్యకి (మాయాబజార్), పౌండ్రక వాసుదేవుడు (శ్రీకృష్ణవిజయం), శకుని (కురుక్షేత్రం) వంటి మెరిశారు. ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎంకరేజ్మెంట్ చేయడంతో ‘రవి ఆర్ట్ థియేటర్స్’ పై ‘నాటకాల రాయుడు’ (1969), ‘ఒకే కుటుంబం’ (1970) చిత్రాలను సినిమాలని  నిర్మించాడు.

also read:టాలీవుడ్‌లో రూ. 3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్‌పై సైబరాబాద్‌లో కేస్ నమోదు !

అయితే కే కుటుంబం చిత్రానికి మూలమైన తమిళ సినిమా ‘పాపమన్నిప్పు’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో ఎమ్.ఆర్. రాధాకు  నాగభూషణం డబ్బింగ్ చెప్పడం ఇక్కడ విశేషం. ఇక ఆ తర్వాత కృష్ణతో మోసగాళ్లకు మోసగాడు’, ‘నేనంటే నేనే’ వంటే సినిమాల్లో వెరైటీ పాత్రలు చేసి మెప్పు పొందాడు నాగభూషణం.ముఖ్యంగా బాపూ రమణల’బాలరాజు కథ’లో ఆయన చేసిన పనిగండం మల్లయ్య పాత్రని ఇప్పటికీ ఒక క్లాసిక్ గా  చెప్పుకుంటారు.ఇక కథానాయకుడు సినిమాలో ఆయన చెప్పిన విలన్ డైలాగులకైతే  థియేటర్లో చెప్పట్లే చప్పట్లు.

చరిత్ర అడక్కు చెప్పింది విను

ముఖ్యంగా అడవి రాముడు సినిమాలో ఆయన చెప్పిన “చరిత్ర అడక్కు చెప్పింది విను”, “షేక్ చినమస్తాన్ లా” వంటి డైలాగులు అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి.ఇక నాగభూషణం నటన ఎంత విలక్షణమైనదంటే ఆ తర్వాత వచ్చిన గోపాలరావు, నూతన ప్రసాద్ ,కోట శ్రీనివాసరావుల నటనపై ఆయన ముద్ర స్పష్టంగా కన్పించేంత.అయితే 1974లో ముత్యాలముగ్గు సినిమాతో రావుగోపాల్రావు ఎంట్రీ ఇవ్వడంతో నాగభూషణం కెరియర్ డైలమాలో పడింది .ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే 1941లో సుబ్బారత్నంతో తొలి వివాహం జరిగింది .  ఆ తర్వాత  ఆమె చనిపోవడంతో శశిరేఖను రెండో పెళ్లి చేసుకున్నాడు.వారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు.అయితే ఆ తర్వాత తన నాటకరంగా సహనటి అయిన సీతని 1956లో మూడో పెళ్లి చేసుకున్నాడు నాగభూషణం.వీరికి ఇద్దరు పిల్లలు అలా ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలతో పెద్ద సంసారాన్ని ఈదాడు నాగభూషణం.ఇక తన కూతురు భువనేశ్వరిని  ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ మీర్ ఇచ్చి ఆ రోజుల్లోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిపించాడు.

నాగభూషణం స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది

సినిమాల్లో ఎంతటి క్రూరమైన, కన్నింగ్ విలన్‌గా నటించినా, నిజజీవితంలో మాత్రం 25 సంవత్సరాల పాటు వందలాది నాటక కళాకారుల కుటుంబాలకు తిండిపెట్టిన రియల్ హీరో ఆయన. 1994లో విడుదలైన ‘నెంబర్ వన్’ చిత్రం నాగభూషణం ఆఖరి సినిమా. కాగా, 1995 మే 5వ తేదీన ఈ మహానటుడు కన్ను మూశారు. వెండితెరపై విలనిజానికి గ్లామర్ అద్దిన నటుడిగా, రంగస్థలంపై రక్తకన్నీరుతో చరిత్ర సృష్టించిన నాగభూషణం స్థానం ఎప్పటికీ చెరిగిపోనిదనడం లో ఆశ్చర్యం లేదు !

Related News

తండ్రిని పట్టుకొని ఏడ్చేసిన అఖిల్.. వీడియో వైరల్!

శోభన్ బాబు తన కొడుకును హీరోగా చేయకపోవడానికి కారణం?

ఆ ఒక్క సినిమా తెచ్చిన తంటా: రూ. 7.35 కోట్ల పెనాల్టీతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ కమెడియన్!

తప్పుడు ప్రచారమే వేగంగా వ్యాప్తి చెందుతోందా.. వైరల్ వీడియోపై చిన్మయి ఫైర్!

వరుణ్ తేజ్ వైల్డెస్ట్ కంబ్యాక్ డేట్ ఫిక్స్…వరుస ప్లాపులకి బ్రేక్ పడేనా?

ప్రభాస్ ‘ఫౌజీ’ థియేట్రికల్ డీల్స్ క్లోజ్…దక్కించుకుంది ఎవరో తెలుసా ?

నాగార్జున తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×