South Movies:ఈ రోజుల్లో సోషల్ మీడియా లేనిదే రోజు గడవడం లేదు. అందులోనూ యూట్యూబ్ చూడని వాళ్లు అసలు ఎవరూ ఉండరు. న్యూస్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ వరకు, వంటల నుంచి సినిమాల వరకు ఏది కావాలన్నా తిరుగులేని ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ మాత్రమే. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను కూడా జనాలు ఫోన్లలోనే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు యూట్యూబ్‌లో పిచ్చ క్రేజ్ ఉంది. ఇంతకీ ఆ రికార్డ్ వ్యూస్ కొట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మన తెలుగు సినిమా సత్తా ఏంటో ఈ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ (ఖూంఖార్) ఏకంగా 1 బిలియన్‌కు పైగా వ్యూస్‌తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యశ్ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ 874 మిలియన్ వ్యూస్‌తో, అల్లు అర్జున్ ‘సరైనోడు’ 720 మిలియన్ వ్యూస్‌తో దుమ్మురేపాయి. ఇక క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతా రామం’ 710 మిలియన్లు, అమితాబ్ ‘సూర్యవంశం’ 679 మిలియన్ వ్యూస్ సాధించి ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి.
త్రివిక్రమ్, నితిన్ కాంబోలో వచ్చిన ‘అ ఆ’ 656 మిలియన్ వ్యూస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. రామ్ పోతినేని ‘హలో గురు ప్రేమ కోసమే’ 629 మిలియన్లు, ‘ది వారియర్’ 467 మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ 465 మిలియన్లు, జ్యోతిక ‘మేడమ్ గీతా రాణి’ 453 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో భారీ ఆదరణ పొందాయి.
నితిన్ ‘ఛల్ మోహన్ రంగా’ 426 మిలియన్లు, సాయి పల్లవి, వరుణ్ తేజ్ ‘ఫిదా’ 415 మిలియన్ వ్యూస్‌తో యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ 403 మిలియన్లు, విజయ్ ‘ఇన్‌స్పెక్టర్ విజయ్’ 401 మిలియన్ వ్యూస్ సాధించాయి. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ 393 మిలియన్లు, ‘నం.1 దిల్‌వాలా’ 335 మిలియన్లు, ‘ది సూపర్ ఖిలాడీ 302 మిలియన్లు, ప్రభాస్ ‘ది రిటర్న్ ఆఫ్ రెబల్’ 276 మిలియన్ వ్యూస్‌తో సత్తా చాటాయి.
ALSO READ:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘వీడొక్కడే’ మూవీ నటుడు!
ఈ సినిమాల్లో చాలావరకు తెలుగు, తమిళంలో తీసినవే అయినా, వాటి హిందీ డబ్బింగ్ వర్షన్లకు నార్త్ ఇండియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మన హీరోల యాక్షన్ సీన్లు, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అందుకే అక్కడ థియేటర్లలో యావరేజ్‌గా ఆడిన సినిమాలు కూడా యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్నాయి.
ఇప్పుడు ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చినా, డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వాళ్ల కంటే ఫ్రీగా యూట్యూబ్‌లో సినిమాలు చూసే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇక చేతిలో డేటా ఉంటే చాలు, ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా నచ్చిన సీన్లు మళ్లీ మళ్లీ చూసుకునే వీలు ఉండటంతో యూట్యూబ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. ఇక భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్, ఎమోషన్ ఉంటే జనాలు యూట్యూబ్‌లో మళ్లీ మళ్లీ చూస్తారని ఈ రికార్డ్స్ చెబుతున్నాయి.