Akashdeep Saigal:ఒకప్పుడు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు సడన్గా అవకాశాలు లేకపోవడం లేదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అయితే మళ్లీ కొన్నేళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చి వాళ్లను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఎప్పటిలాగే అదే అందం, ఫిజిక్ మెయింటైన్ చేస్తే.. ఇంకొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఒకప్పుడు సూర్య ‘ వీడొక్కడే’, విజయ్ సేతుపతి ‘తిలక్’ వంటి చిత్రాలలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి అందరిని భయపెట్టిన ఆకాష్ దీప్ సైగల్ (Akashdeep Saigal) ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ముఖ్యంగా ఆయన ముఖంలో వచ్చిన మార్పులు గతంలో కంటే చాలా భిన్నంగా, స్పష్టంగా కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆకాష్ దీప్ 9 ఏళ్ల తర్వాత ఈ ఏడాది రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా..మరీ బక్క చిక్కిపోయి కనిపించడంతో కాస్త ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’ మొదటి సీజన్లో అన్ష్ గుజ్రాల్ పాత్రతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన..ఆ తర్వాత ఏకలవ్య విరానీగా కూడా కనిపించారు. అప్పట్లో టీవీలో పెద్ద విలన్ గా పేరు దక్కించుకున్న ఈయన.. హిందీ బిగ్ బాస్ 5 ఫైనలిస్ట్ గా కూడా నిలిచారు. అయితే ఇప్పుడు ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ సీరియల్ లో అన్ష్ కొడుకు రేయాన్ష్ వీరానిగా కనిపిస్తున్నారు..
అలాగే నాగిన్ 7 లో కూడా కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ తొమ్మిదేళ్లపాటు నటనకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని ఆకాష్ వెల్లడిస్తూ.. తాను ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఈ తొమ్మిది ఏళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
also read: ఆటో జానీగా ‘కాకా’.. అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!
ఆకాష్ దీప్ సైగల్ విషయానికి వస్తే.. సూర్య – తమన్నా జంటగా కె.వి ఆనంద్ దర్శకత్వంలో విడుదలైన వీడొక్కడే ఒరిజినల్ తమిళ్ చిత్రం అయాన్ లో ప్రతి నాయకుడి పాత్ర పోషించి మెప్పించారు.. 2009లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఈయనకు మంచి విజయాన్ని అందించింది.. ఇదిలా ఉండగా తాజాగా క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ 2లో తన పాత్ర పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. తెరమీద తన తండ్రి పాత్ర కంటే ఆయన పెద్దవాడిలా కనిపిస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు కూడా .. అయితే ఈ విమర్శలపై కూడా ఆకాష్ స్పందిస్తూ..” తాను వాటిని పట్టించుకోలేదని, బయట శబ్దంగా తీసుకున్నాను” అని తెలిపారు . ఇక తొలి సీజన్లో స్మృతి ఇరానీ పాత్ర తులసికి కొడుకుగా నటించిన ఆకాష్ దీప్ ఇప్పుడు ఆమె మనవడి పాత్రలో కనిపిస్తున్నారు. ఇది నటుడిగా తన ప్రస్థానంలో అద్భుతమైన మార్పు అని కూడా అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈయన రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.