Ram Pothineni : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నారు. రామ్ మామూలుగానే అందంగా ఉంటాడు కానీ దర్శకుడు మహేష్ బాబు ఇంకా అందంగా చూపిస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ పోతినేని ఒక పాటను రాసిన విషయం తెలిసిందే. ఈ పాటను అనిరుద్ పాడాడు. ఈ పాట ప్రస్తుతం వైరల్ గా మారింది. పాట విన్న వెంటనే రామ్ లోని ఇంత మంచి సాహిత్య రచయిత ఉన్నాడా అనిపించుకునేలా ఉంది. అయితే రామ్ కి సాహిత్యం మీద అవగాహన ఉంది అనేది ముందు నుంచి తెలిసిందే. కానీ రామ్ సాహిత్యం రాస్తాడు అనేది మాస్ ట్విస్ట్. అసలు రామ్ ఈ పాట రాయడం వెనకాల ఏం జరిగింది.
పాట రాయడానికి కారణం
లిరిక్స్ నేను రాయాలి అనుకోలేదు. నేను మహేష్ సినిమా స్టార్ట్ అవ్వడానికంటే ముందు చాలా జామ్ అయ్యాం. సినిమా గురించి డిస్కషన్ చేస్తున్న, ఈ సాంగ్ వెరీ కాంప్లెక్స్ సాంగ్. మల్టీ లేయర్స్ ఉంటుంది. మీరు ఈ పాటను వింటుంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. డిస్కషన్ చేస్తున్న లిరిసిస్ట్ ఎవరూ కూడా ఇంకా అనుకోలేదు. కానీ ఎవరో ఒకరిని పిలిపిద్దాం అని అనుకున్నాం. నెక్స్ట్ డే మాట్లాడాలి కదా లిరిసిస్ట్ తో అని, లిరిసిస్ట్ వస్తే ఏం చెబుదాం.? అలా అనుకున్నప్పుడు రఫ్ గా ఏదో రాశాను. బాగుంది ఇదే యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేద్దామని మహేష్ అన్నాడు. చరణం రాశాను, పల్లవి కూడా మీరే రాసేయండి అన్నాడు ఏదో రిఫరెన్స్ లాగా రాసాను. కానీ కంప్లీట్ గా పాటను పూర్తి చేశాను.
సాహిత్యం పై అవగాహన
రామ్ విషయానికి వస్తే కొన్నిసార్లు మంచి సాహిత్యాన్ని రచయితల నుంచి తనే కోరుకుంటాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరు సినిమా ఈవెంట్ కి రామ్ వచ్చినప్పుడు, నేను రామ జోగయ్య శాస్త్రి గారిని నాకు మంచి లిరిక్ కావాలి అని అడిగాను. అప్పుడు ఆయన ” తదుపరి జన్మకైనా జాలి చూపే వీలుందంటే” అనే లైన్ రాశారు అని ప్రత్యేకించి చెప్పారు. ఇలా సాహిత్యాన్ని గుర్తుపెట్టుకొని హీరోలు చాలా తక్కువ మంది. బహుశా సాహిత్య మీద ఆ స్థాయి అవగాహన ఉండడం వలనే ఈరోజు రామ్ పాటను రాయగలిగాడు అని అర్థమవుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ పాటకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత మహేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
Also Read: Mahesh Babu: టీనేజ్ లోకి అడుగు పెట్టిన సితార.. స్పెషల్ విషెస్ చెప్పిన మహేష్ బాబు!