TS Police On Cyber Frauds: సైబర్ కేటుగాళ్లు రోజు రోజుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రజలకు మాటమాటలు చెప్పి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. తాజాగా టెలిగ్రామ్ ను వేదికగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త సినిమాల పేరుతో ఆశ చూపించి.. అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. జనరల్ గా కొత్త సినిమా అనగానే చూసేద్దాం అని జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లోకి నేరుగా వచ్చేస్తున్న నేపథ్యంలో వెంటనే చూడాలని భావిస్తారు. ఇక ఈజీగా సినిమాలు చూసేందుకు టెలిగ్రామ్ అనుకూలంగా ఉంటుంది. ఓటీటీలోకి సినిమా అలా రాగానే, పలు ప్లాట్ ఫారమ్ లలో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్ లు కనిపిస్తుంది. అందుకే చాలా మంది నెటిజన్లు టెలిగ్రామ్ గ్రూపులలో చేరిపోతున్నారు. యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు.
కొత్త సినిమాల పేరతో నెటిజన్లకు వల
టెలిగ్రామ్ లో కొత్త సినిమాల పేరుతో సైబర్ మోసగాళ్లు ఫిష్ లింక్ లు పంపిస్తున్నారు. ఆ లింకులను చూడగానే చాలా మంది క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఉచితంగా సినిమా చూడాలని అనుకునే వాళ్లు డౌన్ లోడ్ చేసుకోవాలనే ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే చాలా మంది ఏమాత్రం ఆలోచించకుండా లింక్ ను క్లిక్ చేస్తున్నారు. క్షణాల్లో మీ ఫోన్ లోని డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. పర్సనల్ డేటాతో పాటు బ్యాంకు వివరాలు వారి చేతికి చిక్కుతాయి. మరు క్షణం లోనే బ్యాంకు అకౌంట్లలోని సొమ్ము ఖాళీ అవుతుంది. ఆ తర్వాత లబోదిబో అని తలబాదుకున్నా ఫలితం ఉండదంటున్నారు నిపుణులు.
Read Also: ప్రయాణికుడిని చితకబాదిన రైల్వే కేటరింగ్ సిబ్బంది.. ఆ విషయం ఎవరు లీక్ చేశారు?
పోలీసులు హెచ్చరికలు
కొత్త సినిమాల పేరుతో టెలిగ్రామ్ లో వస్తున్న లింకులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు నెటిజన్లకు సూచిస్తున్నారు. టెలిగ్రామ్ లింక్ ల ద్వారా వచ్చే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దంటున్నారు. థర్డ్ పార్టీ యాప్స్, ఏపీకే ఫైల్స్ తో డేటాను చోరీ చేఏ అవకాశం ఉందంటున్నారు. పైరసీ సినిమాల కోసం వెళ్లి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకోకూడదంటున్నారు. “ కొత్త సినిమా లింక్స్ పేరిట సైబర్ మోసాలు జరుగుతున్నాయి. టెలిగ్రామ్ గ్రూపులలో లింక్స్ తో జాగ్రత్తగా ఉండాలి. కొత్త సినిమాల పేర్లతో వేస్తున్న ఎరను నమ్మకూడదు. ఒకవేళ నమ్మి క్లిక్ చేస్తే అంతే సంగతులు. ఏపీకే ఫైల్స్ తో బ్యాంకు అకౌంట్లను సైబర్ కేటుగాళ్లు కొల్లగొడుతున్నారు. సినిమాల కోసం ఆశపడి సైబర్ మోసాల బారిన పడకూడదు. అప్రమత్తంగా ఉండండి. అవగాహన పెంచుకోండి” అని పోలీసుల సూచిస్తున్నారు.
Read Also: అమ్మమ్మకు మనువడి ఊహించని బహుమతి, ఎవరూ ఇలా ఇచ్చి ఉండరు!