E-Paper
Advertisement

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే
Advertisement

Adult Romantic Drama: చదువుకుంటున్నానని ఇంట్లో అబద్ధం చెప్పే ఓ అమ్మాయి… కానీ ఆమె మనసులో మాత్రం సినిమా తీయాలనే కల. కాలేజీలో కలిసిన ఓ ఒంటరి యువకుడితో కలిసి సినిమా చేయాల్సి రావడంతో మొదలైన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో వాళ్లిద్దరి జీవితాలను కుదిపేసే ఓ రహస్యం బయట పడుతుంది. వాళ్ల ప్రేమను విడదీయాలని చూస్తున్నది ఎవరు ? ఆ యువకుడి గతంలో దాగి ఉన్న విషయం ఏంటి ? ఇదే ‘యూ ప్లస్ మీ: అగైనెస్ట్ ది వరల్డ్’ (You+Me – Against the World) కథ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో తెలుగులో ఉందంటే ?

కథలోకి వెళ్తే…

అల్మా లాంకాస్టర్ సంపన్న కుటుంబానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు తమ కూతురు లా చదువుతోందని అనుకుంటారు. కానీ అల్మాకు మాత్రం సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తన కలను నిజం చేసుకోవడానికి ఫిల్మ్‌ మేకింగ్‌ లోకి అడుగు పెడుతుంది. కాలేజీలో ఆమెకు వాడిమ్ ఆర్కాడి పరిచయం అవుతాడు. వాడిమ్‌ కు కుటుంబంతో పెద్దగా సంబంధాలు ఉండవు. ఒంటరిగా ఉండే అతని ప్రవర్తన కూడా మిగతా విద్యార్థుల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. అతని గతంలో కొన్ని సమస్యలు ఉన్న విషయం కూడా క్రమంగా తెలుస్తుంది.

Advertisement

అనుకోని పరిస్థితుల్లో అల్మా, వాడిమ్ కలిసి ఓ స్టూడెంట్ ఫిల్మ్‌ పై పని చేయాల్సి వస్తుంది. మొదట ఇద్దరికీ ఒకరి పద్ధతి మరొకరికి నచ్చదు. సినిమా విషయంలోనూ, వ్యక్తిగత విషయాల్లోనూ అభిప్రాయాలు కలవవు. కానీ కలిసి పని చేసే కొద్దీ వాళ్ల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ తమ జీవితాల్లోని విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడం మొదలు పెడతారు. అల్మాకు వాడిమ్‌ లో కనిపించే ఒంటరితనం నచ్చుతుంది. వాడిమ్‌ కు అల్మాలో కనిపించే ధైర్యం, తన కల కోసం ఆమె చేసే ప్రయత్నం ఆకట్టుకుంటాయి.

అయితే వాళ్ల ప్రేమ కథకు అనుకోని అడ్డంకులు వస్తాయి. ఎవరో తమ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం వాళ్లకు అర్థమవుతుంది. ముఖ్యంగా వాడిమ్ గతానికి సంబంధించిన కొన్ని విషయాలు బయట పడటంతో పరిస్థితులు తారుమారు అవుతాయి. అల్మా తన కలను వదులుకోవాలా, వాడిమ్‌ తో కలిసి నిలబడాలా అనే గందరగోళ పరిస్థితిలోకి వెళ్తుంది. మరోవైపు వాడిమ్ తన గతం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. మరి ఇంతకీ ఆ అబ్బాయి గతనికి సంబంధించిన సీక్రెట్ ఏంటి ? చివరికి ఈ జంట ఒక్కటయ్యారా లేదా ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 34 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి ఓటీటీలో ఇంగ్లీష్, తెలుగు, ఫ్రెంచ్, హిందీ సహా పలు ఆడియో భాషలు ఉన్నాయి. విట్టోరియా డి సావోయా, లూకాస్ బార్స్కీ, జోయే గార్సియా, లియో లెగ్రాండ్ తదితరులు నటించిన ఈ మూవీకి మనోన్ గౌరిన్ (Manon Gaurin) దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచ్ యంగ్ అడల్ట్ రొమాంటిక్ డ్రామా. సింగిల్ గా చూస్తే బెటర్.

Read Also: ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Related News

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

ఓటీటీలోకి 2 మలయాళం సినిమాలు… ఒకటి థ్రిల్లర్, మరొకటి ఫీల్‌గుడ్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఈ వారం 14 కొత్త సినిమాలు, సిరీస్‌లు… తెలుగులోకి డబ్బింగ్ అయిన క్రేజీ మూవీస్ ఇవే

Big Stories

Advertisement
×