Brain Development: మనిషి మెదడు.. ఒకే వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావించారు. కానీ స్టాన్‌ఫోర్డ్ పరిశోధన ఈ ఆలోచనను మార్చేసింది. భ్రూణ దశలోనే మెదడు రెండు వేర్వేరు వ్యవస్థలుగా అభివృద్ధి చెందుతుందని గుర్తించారు. మెదడులోని ముందుభాగం, వెనుకభాగం.. రెండు వేర్వేరు మూల కణ సమూహాల నుంచి తయారవుతాయని తేల్చారు.
మనిషి మెదడులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఫోర్‌బ్రెయిన్.. ఆలోచనలు, భాష, జ్ఞాపకం, చైతన్యం వంటి కీలక పనులను నియంత్రిస్తుంది. హైండ్‌బ్రెయిన్ మాత్రం శరీరంలోని ప్రాథమిక విధులను నిర్వహిస్తుంది. శ్వాస, గుండె కొట్టుకోవడం, నిద్ర, ఆకలి, మాట్లాడటం, మింగడం వంటి పనుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటివరకు ఈ భాగాలన్నీ ఒకే రకమైన ప్రారంభ కణాల నుంచి వస్తాయని భావించారు. కానీ కొత్త పరిశోధనలో ఇది భిన్నమని తేలింది.
Also read: జన్వాడ ఫామ్‌హౌస్‌పై రాజకీయ దుమారం.. కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్!
స్టాన్‌ఫోర్డ్ బృందం ఈ పరిశోధనలో మరో కీలక ముందడుగు వేసింది. స్టెమ్ సెల్స్ నుంచి ప్రయోగశాలలో పనిచేసే మానవ హైండ్‌బ్రెయిన్ మోటార్ న్యూరాన్లను తయారు చేశారు. ఈ కణాలు నాడీ సంకేతాలను ప్రసారం చేయడమే కాకుండా.. ముఖ కదలికలు, మింగే ప్రక్రియకు సంబంధించిన న్యూరాన్ల లక్షణాలను చూపించాయి. కోళ్లు, జీబ్రాఫిష్, అకార్న్ వార్మ్స్ వంటి జీవులపై పరిశీలన చేసినా.. ఇదే అభివృద్ధి విధానం కనిపించింది. అంటే ఈ విభజన వందల కోట్ల ఏళ్లుగా కొనసాగుతోందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ ఆవిష్కరణ ముఖ్యంగా ALS, SMA వంటి వ్యాధుల పరిశోధనలో ఉపయోగపడనుంది. ఈ వ్యాధుల్లో మెదడు కండరాలను నియంత్రించే కొన్ని నాడీ కణాలు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయి. రోగుల నుంచి ఈ కణాలను నేరుగా సేకరించడం కష్టం. కానీ ప్రయోగశాలలో వీటిని తయారు చేయగలిగితే.. వ్యాధి ఎలా వస్తుంది..? చికిత్సలు ఎలా అభివృద్ధి చేయాలి..? అనే అంశాలను మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంటుంది.
Also read: విడాకుల వ్యవహారంపై స్పందించిన నీతి టేలర్.. అంత మాట అన్నారేంటి?