E-Paper
Advertisement

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement

Ponnam Prabhakar: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని మహబూబాబాద్ పార్లమెంట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది… మానుకోట రాళ్లేనని గుర్తు చేశారు. సకల జనులు తెలంగాణ కోసం ఉద్యమం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుని, నియంతృత్వానికి వ్యతిరేకంగా జీవించాలని తెలంగాణను సాధించుకున్నామన్నారు.

ఫోన్ టాపింగ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది..

ఫోన్ టాపింగ్ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించినదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాటి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లతో పాటు, అధికారులు, సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు, సొంత కుటుంబంలోని అల్లుడు, బిడ్డ, ఇతర ప్రముఖుల ఫోన్లను టాపింగ్ చేసి రాష్ట్రంలో టిఆర్ఎస్ పేరిట రమ్మంటే రాష్ట్రంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం దురదృష్టకరమన్నారు.

దేశద్రోహులను అరికట్టేందుకు ఫోన్ టాపింగ్ చేశారా..?

Advertisement

దేశద్రోహులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల పై పోలీస్ నిఘా వేసి ఫోన్ టాపింగ్ చేశారా….? ఎవరికోసం చేశారు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తుంటే ప్రభుత్వంలో అధికారంలో ఉండి రాష్ట్రం లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఫోన్ టాపింగ్ చేయడం ఎంతవరకు సమంజసని ప్రశ్నించారు. సంఘవిద్రోహుల పై నిఘ పెట్టాల్సింది పోయి తెలంగాణ లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సొంత కుటుంబ సభ్యులపై ఫోన్ టాపింగ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తప్పుడు పనులు చేసిన వారికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

Also Read: Gaddar film Awards 2025: గద్దర్ ఫిలిం అవార్డ్స్.. దరఖాస్తు గడువు పొడిగింపు..

కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందనేది శుద్ధ తప్పు

Advertisement

ఫోన్ టాపింగ్ చేసి విచారణకు హాజరు కాకుండా ఉండడం, అందుకు కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందనేది శుద్ధతప్పని మంత్రి పొన్నం పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఫోన్ టాపింగ్ చేసి ద్రోహం చేయడం సమంజసం కాదన్నారు. అహంకారాన్ని ప్రజలు ఓడించిండ్రు తెలంగాణలో అహంకార ప్రభుత్వం వద్దని ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించిర్రని మంత్రి పొన్నం గుర్తు చేశారు. దురహంకారానికి గుర్తుగా పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్న ఇచ్చారని వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిన వారి వంకర బుద్ధి మారడం లేదని విమర్శించారు. విధివిధానాలు లేని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వారిది సిగ్గులేని చర్య అని పేర్కొన్నారు.

చట్టం, రాజ్యాంగం కాంగ్రెస్‌తోనే విరజిల్లుతోంది..

భారతదేశంలో చట్టం, రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీతోనే విరాజిల్లుతోందని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన విధంగానే తీర్పు మునిసిపాలిటీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు.

సమన్వయం కావాలి.. ప్రజల మన్ననలు పొందాలి

మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనే మునిసిపాలిటీలో నాయకులంతా సమన్వయం కావాలని, ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని వార్డులను గెలుచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆశావహులు చాలామంది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మేరకు బీఫాములను అందిస్తామన్నారు. పార్టీ కోసం అందరూ కష్టపడ్డారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఆశావాహులు ఎక్కువమంది ఉన్నప్పటికీ అందరూ కలిసి నాయకత్వాన్ని ఎంచుకోవాలని సూచించారు.

Also Read: KCR Interrogation: కేసీఆర్ ఇంట్లో సిట్ అధికారుల విచారణకు సర్వం సిద్ధం.. విచారణ షురూ! 

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×