Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు డ్యూయల్ రోల్ తో ఎక్కువ సినిమాలు వచ్చేవి. ఒక హీరో డ్యూయల్ రోల్లో కనిపించాడు అంటే ఆ సినిమా మంచి టాక్ని సొంతం చేసుకునేది. ఆ తర్వాత కొంతమంది స్టార్ హీరోలు త్రిపాత్రాభినయం చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు మూడు పాత్రల్లో నటించారు. ఇప్పటివరకు ఎంతమంది హీరోలు తెలుగు సినిమాల్లో నటించారు. ఆ సినిమాల పేర్లు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
నందమూరి తారకరామారావు..
నటసార్వభౌమ నందమూరి తారక రామారావు త్రిపాత్రాభినయానికి పర్యాయపదం. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి త్రిపుల్ రోల్ చేశారు. ఒక్క సినిమా కాదు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు ఎన్టీఆర్. ఆయన త్రిపాత్రాభినయం చేసిన సినిమాల విషయానికొస్తే.. కులగౌరవం, శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర, వంటి చిత్రాలలో మూడు, అంతకంటే ఎక్కువ పాత్రలు పోషించి నటుడుగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సినిమాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండేలా చేస్తున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ..
ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ పాత్రలు చేసిన స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. కుమార రాజా, పగబట్టిన సింహం, రక్తసంబంధం, బంగారు కాపురం, బొబ్బిలి దొర, డాక్టర్ సినీ యాక్టర్, సిరిపురం మొనగాడు వంటి సినిమాల్లో నటించాడు.
అక్కినేని నాగేశ్వరరావు..
అక్కినేని నాగేశ్వరరావు సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నటుడు ఏఎన్నార్. ఈయన ఒకటి రెండు పాత్రలు కాదు ఒక సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రల్లో నటించి మెప్పించాడు. ఏఎన్ఆర్ నటించిన ఆ సినిమా పేరు నవరాత్రి..
శోభన్ బాబు..
శోభన్ బాబు సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికి తెలుసు.. ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రంలో మొట్టమొదటిసారిగా ట్రిపుల్ రోల్ లో నటించారు. ముగ్గురు మొనగాళ్లు, లారీ డ్రైవర్, పోలీస్ ఆఫీసర్, క్లాసిక ల్ డాన్సర్ ఇలా ముచ్చటగా మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి మెప్పించారు.
Also Read :సింహామైన చొంగ కార్చాల్సిందే.. ఇదేం కంపారిజన్ తల్లి..
వీళ్లే కాదు చాలా మంది స్టార్స్ ఉన్నారు.. అందులో నందమూరి నరసింహం బాలయ్య కూడా త్రిపాత్రాభినయం చేశారు. అధినాయకుడు చిత్రంలో మొదటిసారి ట్రిపుల్ లో నటించారు. అలాగే జై లవకుశ చిత్రంలో వైవిధ్యభరితమైన మూడు పాత్రలలో నటించి తన నటనతో పాత్రలకు ప్రాణం పోశాడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. అమిగోస్ మూవీ లో మూడు సరికొత్త గెటప్స్, డిఫరెంట్ క్యారెక్టర్ల లో కనిపించి కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు పోషించాడు. అప్పటిలో హీరోలకు ఎక్కువగా డూపులు వాడరు, అందుకే ఇలాంటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు చెయ్యాలంటే బడ్జెట్ తో పాటు ధైర్యం కూడా ఉండాలి.. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు వస్తాయేమో చూడాలి..