Tollywood Heroines : సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఒకవేళ టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా కొన్ని సినిమాలతో రిస్క్ చెయ్యలేమని చేతులు ఎత్తేశారు. అయితే సక్సెస్ తో దూసుకుపోతున్న స్టార్స్ కు వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి. హీరోయిన్లకు సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్.. సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అయితే తప్ప వాళ్ళకి వేరే ఆఫర్స్ రావని విషయాలు ఇప్పటికే చాలా సందర్భాల్లో కన్ఫామ్ అయ్యింది. అయితే ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతూ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్లు సడన్గా ఇండస్ట్రీకి దూరమయ్యారు.. కెరీర్ పీక్స్ లో ఉండగానే మృత్యువు కబలించింది.. అతి చిన్న వయసులోనే మరణించిన హీరోయిన్లు ఎవరు ఒకసారి తెలుసుకుందాం..
చిన్నవయసులోనే మరణించిన హీరోయిన్లు..
సౌందర్య..
కన్నడ నటి అయిన హీరోయిన్ సౌందర్య తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించింది. అలనాటి హీరోయిన్ సావిత్రి తర్వాత సౌందర్యకే ఆ స్థానం దక్కింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. అదే ఆమెకు చివరి రోజులు అయ్యింది.
ప్రత్యూష..
వరుసగా మంచి అవకాశాలు అందుకుంటున్న టైం లో ఈమె మరణించింది. కొంతమంది ఈమెపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈమె ఎలా చనిపోయిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
దివ్యభారతి..
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది హీరోయిన్ దివ్యభారతి.. స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకున్న టైములో ఈమె మరణించింది. 19 ఏళ్లకే ఈమె మరణించడం విషాదకరం.. ఆమె చనిపోయిన ఆమె సినిమాలు ఇప్పటికీ గుర్తు చేస్తున్నాయి.
స్టార్ హీరోయిన్లలో వీరితోపాటు మరికొంతమంది కూడా ఉన్నారు. టాప్ లో వీళ్లు ఉన్నారు. ఈమధ్య వీళ్లు చనిపోయిన వీళ్ళ గురించి వార్తలు ఎక్కువగా వినిపించడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు.
Also Read: ఆ హీరో నన్ను దారుణంగా కొట్టాడు.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజాలు..
హీరోయిన్లు మాత్రమే కాదు మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా పలు కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో యశోసాగర్ ఒకరు.. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం హీరో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న టైములో 25 ఏళ్లకే మరణించాడు.. అలాగే ఏం ఏస్ నారాయణ 63 ఏళ్ల వయసులో మరణించాడు. కానీ ఆ టైముకి ఈయన స్టార్ కమెడియన్ గా 20 కి పైగా సినిమా ఆఫర్లతో బిజీ గా ఉన్నాడు. శ్రీహరి.. విలన్ గా, హీరోగా రాణించిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు శ్రీహరి. కానీ 49 ఏళ్లకే ఈయన మరణించారు. అదే విధంగా TNR నటుడిగా, జర్నలిస్టుగా కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ఈయన కరోనాతో మరణించాడు. ఈయన వయసు కేవలం 45 ఏళ్లు మాత్రమే.. ఇలా ఇంకా చాలా మంది కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే మరణించారు..