Sree Leela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీలా (Sree Leela).’ పెళ్లి సందD’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ‘ధమాకా’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసింది కానీ అనుకున్నంత సక్సెస్ లభించలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్లో సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అక్కడే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను బిజీగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సమయంలో శ్రీ లీలపై బాలీవుడ్ లో ఒక కొత్త గాసిప్ మొదలైంది.
అలాంటి జబ్బుతో శ్రీ లీల..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల బాలీవుడ్ లో కొత్త నటీనటులతో తీసిన చిత్రం ‘సైయారా’. ఊహించని సక్సెస్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి.. కలెక్షన్లు కూడా భారీగా వచ్చి పడుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. అటు ప్రస్తుతం శ్రీలీల హిందీలో చేస్తున్న సినిమా కూడా దాదాపు ఇలాంటి కథతోనే రాబోతోందనే ప్రచారం మొదలైంది. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా దాదాపు సైయారా సినిమా తరహాలోనే ఉంటుందని, బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పైగా శ్రీ లీలా పాత్రకి కూడా ఇందులో నయం కానీ జబ్బు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవడంతో.. దీనిపై దర్శకుడు స్పందించారు.
రూమర్స్ పై స్పందించిన డైరెక్టర్ అనురాగ్..
దర్శకుడు అనురాగ్ బసు(Anurag Basu) మాట్లాడుతూ.. “నా సినిమా కథకు.. సైయారా మూవీకి ఎటువంటి సంబంధం లేదు. శ్రీ లీలా పాత్రకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.” అంటూ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ పూర్తికానే లేదు. అప్పుడే హీరోయిన్ పై ఇలాంటి కామెంట్లు చేయడం ఏమాత్రం తగదు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు డైరెక్టర్. ఇకపోతే రీసెంట్గా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. కథ , స్క్రీన్ ప్లే మార్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే వాదనని కూడా ఆయన తోసిపుచ్చారు. ఇక ప్రస్తుతం వీరిపై వస్తున్న వార్తలను డైరెక్టర్ ఖండించే ప్రయత్నం చేశారు. మరి ఇకనైనా రూమర్స్ ఆగిపోతాయా లేదా అన్నది చూడాలి.
శ్రీ లీల కెరియర్..
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. శ్రీలీల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ అప్పుడే ఎన్నో రూమర్లు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో పడిందని,అటు కార్తీక్ ఆర్యన్ తల్లి కూడా డాక్టర్ ను తన ఇంటి కోడలుగా తెచ్చుకుంటానని చెప్పడంతో పలు అనుమానాలకు దారితీసింది. ఇప్పుడేమో పెద్ద జబ్బుబారిన పడింది అంటూ ఇలా రకరకాల రూమర్స్ వైరల్ చేస్తుండడంతో.. శ్రీ లీలా సౌత్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనిపై శ్రీ లీలా కూడా స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం.
ALSO READ: Payal Rajput: హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. పాయల్ రాజ్ పుత్ తండ్రి కన్నుమూత!