Star Heroine : ఈమధ్య కాలంలో హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా షూటింగ్లో సమయంలో తమకు జరిగిన అనుభవాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు షూటింగ్ సమయాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అన్న విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఒక ఊపు ఊపేసిన సీనియర్ హీరోయిన్ సైతం ఈమధ్య పలు ఛానెల్స్ కు తమ ఇంటర్వ్యూ లిస్తూ బిజీగా ఉంటున్నారు. అలాగే తాజాగా నాగార్జున హీరోయిన్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో ఆమెకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది.. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
నాగార్జున చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న హీరోయిన్..
అక్కినేని నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో హీరోయిన్గా నటించిన ఇషా కొప్పికర్ అందరికీ సుపరిచితమే. ఆ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడుకు మంచి పేరు వచ్చింది. తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. చంద్రలేఖసినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను తాజాగా ఆమె పంచుకుంది .. నేను చెప్తే నాగార్జున అభిమానులు ఎవరు కూడా నమ్మరు అని ఆమె అన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నన్ను నాగార్జున 14 సార్లు చంప దెబ్బ కొట్టారు అని బయటపెట్టింది. మొదట ఆయన చిన్నగా కొట్టాడు. ఫీల్ రాలేదని నేనే గెట్టిగా కొట్టమని చెప్పాను. 14 సార్లు రీ షూట్ చేస్తే నా మొహం వాచిపోయింది. ఆయన చేతి వేళ్ళ గుర్తులు నా మొహం పై కొద్దిసేపు అలానే ఉండిపోయాయి అని నవ్వుతూ చెప్పింది ఇషా.. మూవీ తర్వాత ఆమె 80 కి పైగా సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు మరాఠీ, హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
Also Read : రజనీకాంత్ ఇంట్లో ప్రమాదం… సూపర్ స్టార్ కి గాయాలు ?
ఇషా తెలుగులో చేసిన సినిమాలు..
నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న చంద్రలేఖ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే. చివరగా తెలుగులో కేశవ సినిమాలో నటించింది. ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఈమధ్య తెలుగులో అవకాశాలు రాలేదని తెలుస్తుంది.. ప్రస్తుతం హిందీ మరాఠీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది. హీరోయిన్లకు వయసు కనిపిస్తుందేమో కానీ హీరోలకు మాత్రం వయసు కనిపించదు అని చెప్పడానికి నాగార్జునను ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి హీరోగా రాణిస్తున్న ఈయన ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన కుబేర సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు రజనీకాంత్ తో కలిసి కూలీ సినిమాలో నటించాడు. ఆ మూవీ కూడా వచ్చే నెల 14న థియేటర్లోకి రాబోతుంది.