Tollywood Hero: ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అటు ప్రేమలో పడ్డా .. ఇటు డేటింగ్ చేసినా.. పెళ్లి చేసుకున్నా.. ఆఖరికి తల్లిదండ్రులు అయిన విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు.. ముఖ్యంగా వీరు చెప్పే శుభవార్తలు అభిమానులకి కూడా మంచి ఆనందాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరో తాను తండ్రిని అయ్యాను అంటూ తన భార్య బేబీ బంప్ ను ముద్దాడుతున్న ఫోటోని షేర్ చేశారు.
తండ్రి అయిన టాలీవుడ్ హీరో..
ఆ హీరో ఎవరో కాదు అదిత్ అరుణ్ (Adith arun).. తాజాగా ఆయన తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన భార్య బేబీ బంప్ కి ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేస్తూ.. సెప్టెంబర్ 2న తన భార్య డెలివరీ అయినట్లు స్పష్టం చేశారు. అయితే పుట్టింది పాప? లేక బాబు? అన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు అభిమానులు, నెటిజన్స్, సెలబ్రిటీలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు నాడే ఈ హీరో తండ్రి అయ్యారని తెలిపి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మరింత సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.
అదిత్ అరుణ్ వ్యక్తిగత జీవితం..
అజిత్ అరుణ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. నివేదిత అనే అమ్మాయితో 2023 సెప్టెంబర్ 3న తమిళనాడు తిరువూరులోని శ్రీ సెంథూర్ మహల్ లో ఏడడుగులు వేశారు. ఇప్పుడు ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే వీరిది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అన్నది మాత్రం తెలియలేదు.
అదిత్ అరుణ్ కెరియర్..
అరుణ్ కెరియర్ విషయానికి వస్తే.. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ముఖ్యంగా హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు అదిత్. ఈయన నటించిన సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘కథ’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత, కొండా, 24 కిసెస్, డియర్ మేఘ, ప్రేమదేశం, ఉద్వేగం, లైన్ మెన్ వంటి చిత్రాలలో నటించారు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా పలు చిత్రాలలో నటించారు.
పేరు మార్చుకున్న అదిత్ అరుణ్..
ఇకపోతే 2022లో తన పేరును త్రిగుణ్ (Thrigun)గా మార్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ లో ప్రకటించారు. “ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ ” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఈయన నటించిన వెబ్ సిరీస్లు..
ఒకవైపు సినిమాలే కాకుండా మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. 2017లో వచ్చిన ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’ తో పాటు 2021 లో వచ్చిన ’11 అవర్’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇది ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
also read:AR Muragadoss: మదరాసి టైటిల్ వెనుక ఇంత కథ ఉందా.. రివీల్ చేసిన డైరెక్టర్!