Guppedantha Manasu : ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్ల మీదే యూత్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ ద్వారా చాలామంది హీరోయిన్లు పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అయితే అందులో తెలుగు వాళ్ళ కన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వల్లే ఎక్కువగా ఉన్నారు. అందులో ప్రముఖంగా వినిపించే పేరు వంటలక్క. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధార.. కన్నడి ముద్దుగుమ్మయిన ఈమె ఈ సీరియల్ ద్వారా బాగా పాపులాటిని సంపాదించుకుంది. ఈ మా అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్ లో తెగ వెతికేస్తుంటారు. తాజాగా ఈమె లవ్ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ వసు అలియాస్ రక్షా గౌడ క్రష్ ఎవరో తెలుసుకుందాం..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మొదట పలు సీరియల్స్ తో అలరించింది. ఇక ఎప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ మొదలయ్యిందో అప్పటినుంచి ఈమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. గరుడాక్ష అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఇవి మొదట కన్నడ సీరియల్స్ సినిమాలో చేసి బాగా ఫేమస్ అయింది. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈమె అందానికి తెలుగు యువత ఫిదా అవుతున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రక్షా తన మొదటి క్రష్ గురించి బయట పెట్టింది. తన మనసులో వేరే వాళ్ల మీద ఫీలింగ్ లేదు కానీ ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా కార్తికేయ అంటే ఇష్టం ఉంది అని బయటపెట్టింది. నా క్రష్ అతనిని ఆమె అన్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో కుర్రాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు.
Also Read :స్కిట్ కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టిన భాస్కర్.. బాబోయ్ నరకమే..
తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి అందరికీ తెలుసు. సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడి ముద్దుగుమ్మ రక్షా గౌడ. తన క్యూట్ అందంతో అమాయకపు మాటలతో సీరియల్ లోని కొన్ని సీన్లతో అందరినీ తన వైపు తిప్పుకుంది. ఇక ఈమె ఒక్కో ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందని చాలామందికి డౌట్ ఉంటుంది. నిజానికి ఒక ఎపిసోడ్కి ఈమె దాదాపు 20 వేలు వరకు వసూలు చేస్తుంది.. నెలలో 20 రోజులు లేదా 25 రోజులు వరకు సీరియల్ షూటింగ్లో జరుగుతుంటాయి.. ఈ లెక్కన చూసుకుంటే బాగానే సంపాదిస్తుంది. ప్రస్తుతం గుప్పెడంత మనసు 2 కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.. దీంతో పాటుగా మరో సీరియల్ లో కూడా నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..