Rushikonda Palace: ఏపీలో రాజకీయాలు రుషికొండ ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నాయా? జగన్ పాలనలో కట్టిన ఈ భవనాలను ఏం చేయ్యాలో ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారా? మరి ముగింపు ఏ విధంగా ఉంటుంది? గోవా గవర్నర్ రాజుగారి మాటలను ఏకీభవిస్తారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రుషికొండ ప్యాలెస్.. వైసీపీ హయాంలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ఆనాడు అక్కడ ఏ పని చేసినా తాటికాయంత అక్షరాలతో వార్తల్లో నిలిచేది. ఆఫ్ కోర్సు ప్రభుత్వం కూడా ఆ విధంగా చేసిందను కోండి అది వేరే విషయం. గత ఎన్నికల్లో వైసీపీపై కూటమి ఎక్కుపెట్టిన అస్త్రాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 500 కోట్ల రూపాయలతో కట్టిన ఈ భవనాలను ఏం చెయ్యాలో తెలియన ప్రభుత్వ పెద్దలు.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రెండేళ్ల కిందట రూ. 450 కోట్లతో రుషికొండపై 7 భారీ భవనాలు నిర్మించింది వైసీపీ ప్రభుత్వం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 14 నెలలు గడిచినా ఈ భవనాల విషయం కొలిక్కిరావడం లేదు. ఆ భవనాలను వినియోగంలోకి తీసుకురాలేకపోతోంది కూటమి ప్రభుత్వం.
గతవారం విశాఖ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పార్టీ నేతలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించారు. ఏడాది తర్వాత భవనాల లోపల నాణ్యత లోపించింది. సీలింగ్ పెచ్చులు ఊడిపోయాయి. దీన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అదే సమయంలో వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ALSO READ: శ్యామల హారతి.. పాట పాడి ట్రోల్ చేసిన కిరాక్ ఆర్పీ
ఆ భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించడంతో వినియోగంలోకి తీసుకురావడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రెండు నెలల్లో రుషికొండ భవనాలను ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
దుబాయ్‌లోని మైస్ విధానాన్ని అనుసరిస్తే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి తీసుకురావచ్చని ప్రతిపాదించారు డిప్యూటీ సీఎం. అంతేకాదు ప్యాలెస్‌లో మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తే ఆదాయం వస్తుందన్నారు. గురువారం జరగనున్న కేబినెట్ భేటీలో ఆ భవనాల వినియోగంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సీలింగ్‌కు పెచ్చులు ఊడిపోవడంతో జగన్ సేఫ్ అయ్యారని చాలామంది సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. పొరపాటున వైసీపీ ప్రభుత్వం వచ్చినట్లయితే అందులో జగన్ ఫ్యామిలీ ఉండేదని, ఇలా పెచ్చలు ఊడిపోవడంతో గాయాలు పాలయ్యేవారని కామెంట్స్ పడిపోయాయి. భవనాల నాణ్యతపై అడిటింగ్ చేపట్టాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు కూడా.
బుధవారం విశాఖ వచ్చారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, రుషికొండ భవనాలపై మనసులోని మాట బయటపెట్టారు. రుషికొండ ప్యాలెస్‌ను మానసిక వైద్యశాలగా మార్చితే బాగుంటుందన్నారు. అందులో చేర్చితే వారికి ఈ విధంగానైనా మార్పు వస్తుందని నవ్వుతూ ఎద్దేవా చేశారు.
సుమారు రూ.600 కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్ పెచ్చులూడిపోతున్నాయని అన్నారు. అధికార పార్టీ నేతల మాటలు తమకు అనుకూలంగా మలచకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. కట్టడాలంటే ఆ విధంగా ఉండాలని, రుషికొండ భవనాలు తమ ఘనతేనని చెబుతున్నారు.