E-Paper
Advertisement

ఆశా భోస్లే మరణం..సంతాపం తెలిపిన టాలీవుడ్ స్టార్ హీరోలు!

ఆశా భోస్లే మరణం..సంతాపం తెలిపిన టాలీవుడ్ స్టార్ హీరోలు!
Advertisement

Asha BhosleDeath: లెజెండరీ సింగర్ ఆశాబోస్లే ఇక లేరనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఈమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆశాభోస్లే మరణించారని తెలుస్తోంది. ఇక ఈమె మరణ వార్త తెలిసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా ఈమెకు సంతాపం తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్స్ సైతం ఆశాభోస్లే మరణం పట్ల నివాళులు అర్పించారు.

పాటకు అందాన్ని తీసుకువచ్చారు…

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి(Chiranjeevi) ఈమె మరణం పై స్పందిస్తూ.. భారతీయ చిత్ర పరిశ్రమ ఒక అమూల్యమైన సింగర ను కోల్పోయింది ఆశాభోస్లే గారి గాత్రం తరతరాలుగా ఎన్నో భావోద్వేగాలను మోసుకొచ్చింది. ఆమె ప్రతిపాటకు ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని తీసుకువచ్చారు. ఆమెలోని బహుముఖ ప్రజ్ఞనను నేను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను అంటూ చిరంజీవి ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

తరతరాలు నిలిచిపోయే పాటలను ఇచ్చారు..

Advertisement

ఎన్టీఆర్ సైతం ఆశాభోస్లే మరణం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దశాబ్దాల కాలం పాటు ఆశాభోస్లే గారు భారతీయ సినిమాలకు ప్రాణంగా నిలిచారు. పరిశ్రమలో తరతరాలు పాటు నిలిచిపోయే అద్భుతమైన పాటలను మనకు అందించి వెళ్లిపోయారు. ఈమె మృతి బాధాకరం ఈమె మరణం పట్ల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. లెజెండరీ సింగర్ మరణం పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆశాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..

Advertisement

ప్రముఖ గాయని శ్రీమతి ఆశాభోస్లే కన్నుమూసారని తెలిసి చాలా చింతించాను ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘకాలం పాటు వివిధ భాషలలో పాటలను పాడిన అద్భుతమైన గాయని. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితమే. శ్రీమతి ఆశా భోస్లే గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సైతం తన ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఇలా వేల సంఖ్యలో పాటలను ఆలపిస్తూ తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఆ గొంతు మూగబోయిందనే వార్త అభిమానులకు మింగుడు పడలేదని చెప్పాలి.

Also Read: అప్పుడు లావణ్య..ఇప్పుడు మృణాళ్ తెలుగు హీరోని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వు: అల్లు అరవింద్

Related News

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

Big Stories

Advertisement
×