Fake Billing Hospitals: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ లెక్కలను తప్పులు చూపిస్తూ భారీగా బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు దృష్టికి చేరింది. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ స్టాఫ్ సంఖ్య బెడ్లకు అనుగుణంగా పూర్తి స్థాయిలో లేకపోయినా.. ఉన్నట్లు చూపించి బిల్లులు తీసుకుంటున్నట్లు ఇటీవల ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందులో కొందరు డాక్టర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు కుమ్మక్కైనట్లు తెలుస్తున్నది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తో పాటు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.దీంతో అన్ని ఆసుపత్రుల్లో ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. రికార్డుల నుంచి స్టాఫ్ పనితీరు వరకు అన్నింటినీ మానిటరింగ్ చేయనున్నారు.
తాజాగా గాంధీ ఆసుపత్రి లో సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ ఫేక్ సెక్యూరిటీ గార్డును ఆమె గుర్తించి వార్నింగ్ ఇచ్చారు.సెక్యూరిటీ యూనిఫామ్ వేసుకొని, ఐడీ కార్డులు వంటివి ఏమీ లేకుండానే వార్డుల్లో ఆ వ్యక్తి పనిచేయడం గమనార్హం. దీంతో అవాక్కైన ఆమె సూపర్ వైజర్లకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో గాంధీలో స్టాఫ్ లెక్కలను ఆమె పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉస్మానియా, నిలోఫర్ తో పాటు కీలకమైన ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నిరుపేదలకు వైద్యం అందించే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి పెద్దాసుపత్రుల్లో శానిటేషన్,సెక్యూరిటీ సేవల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని అనుమానం వ్యక్తం అవుతుంది.
గాంధీ ఆసుపత్రిలో దాదాపు 1500 బెడ్లు ఉన్నాయి. ఇక్కడ పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కలిసి దాదాపు 700 మందికి పైనే ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మూడు నుంచి నాలుగు వందల వరకు మాత్రమే పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారుల ఎంక్వైయిరీలో తేలింది. కానీ పూర్తి స్థాయిలో బెడ్లకు అనుగుణంగా సంఖ్యను ఫిలప్ చేసి బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు. గాంధీలో ప్రతీ నెల దాదాపు కోటిన్నర రూపాయలు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బిల్లులు క్లెయిమ్‌కు కొందరు ఆర్ ఎంవోలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులు అనుమానం ఉన్నది.
Also Read: అలా చేసినందుకు యాంకర్ విష్ణుప్రియపై పోలీసు కేసు.. ఎందుకంటే?
ఉస్మానియాలోనూ బెడ్ల సంఖ్యకు అనుగుణంగా స్టాఫ్ లేకపోయినా.. ఉన్నట్లు చూపించి బిల్లులు పొందుతున్నారు. తప్పుడు అటెండెన్స్ లు, రిపోర్టులు చూపిస్తూ బిల్లులు పొందుతున్నారు. డ్యూటీలో లేని వారిని, ప్రైవేట్ వ్యక్తులను చూపిస్తూ నిధుల గోల్ మాల్ కు చొరవ తీసుకుంటున్నారు. నిలోఫర్ లోనూ ఇదే దందా జరుగుతుంది. జిల్లా ఆసుపత్రుల్లోనైతే తమదే రాజ్యం అన్నట్లు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తే కానీ నిధులు దుర్వినియోగం కావని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక ఆసుపత్రుల్లో పనిచేసే శానిటేషన్, సెక్యూరిటీ,పేషెంట్ కేర్ స్టాఫ్ కు అతి తక్కువ జీతాలు ఇస్తూ కాంట్రాక్టర్లు వారిని కూడా శ్రమ దోపిడి చేస్తున్నారు. నిబంధనలు ప్రకారం జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. కానీ తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వం నుంచి మాత్రం లక్షల రూపాయలను అవినీతి మార్గంలో కొందరు కాంట్రాక్టర్లు పొందుతున్నారు. ఈ విషయం ఆయా ఆసుపత్రులలో పనిచేసే స్టాప్ కు కూడా తెలుసు. దీంతో ఈ నెల 21 న కొత్త టెండర్లు వేయాలని, తమకు అతి తక్కువ జీతాలు ఇస్తూ పనిచేయించుకోవడం సరికాదంటూ స్టాఫ్ ధర్నాకు దిగనున్నారు. అన్ని ఆసుపత్రులలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరగనున్నది.
Alao read: ఆ శాఖలో పనిచేయాలంటే జంకుతున్న ప్రభుత్వ ఉద్యోగులు