Kantara Chapter 1: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం కాంతార.. గతంలో వచ్చిన ఈ సినిమా భారీ విషయాన్ని సొంతం చేసుకుంది ఆ సినిమాకు సీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 సినిమా ఇటీవలే దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చేసింది.. కేవలం వారం రోజులలోనే 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లేందుకు పరుగులు పెడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు ఇండియా వైడ్ భారీ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమాకు ఓవర్సీస్ లో మాత్రం షాక్ తగిలేలా కనిపిస్తుంది.. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవడంతో సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులు ప్రమాదవశాత్తు చనిపోయిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా దసరా సందర్భంగా థియేటర్లలోకి రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. కచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదని తెలుస్తుంది. యుఎస్‌లో ఈ సినిమా బయ్యర్‌కు నష్టాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం ఏకంగా 50 కోట్ల దాకా పెట్టుబడి పెట్టేశారు. కాంతార ప్రీక్వెల్ కావడంతో జనం ఎగబడి చూస్తారనే ధీమాతో భారీ పెట్టుబడి పెట్టారు.. కానీ కనీసం ఈ సినిమాను చూడడానికి జనాలు ఆసక్తి చూపించకపోవడంతో నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
Also Read : చక్రధర్ మాస్టర్ ప్లాన్.. అవనితో పల్లవి గొడవ.. ఇంట్లో నిజం తెలిసిపోతుందా..?
ఇండియన్ సినిమాకు యుఎస్ లో ప్రీమియర్ షో లతోనే మంచి టాక్ తో పాటు కలెక్షన్లు కూడా వస్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇక్కడ రిలీజ్ అయిన భారీ చిత్రాలకు మంచి కలెక్షన్లు వసూల్ అయ్యాయి. కానీ ఈ సినిమాకు మాత్రం ప్రీమియర్ షో లతో పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. ప్రిమియర్స్ నుంచే ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. వీకెండ్ అయ్యేసరికి వసూళ్లు 2.7 మిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.. మొదటి వీకెండు సినిమాకు పెద్దగా కలెక్షన్ రాలేదు.. కానీ రెండో వారం మాత్రం ఈ సినిమాకు వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం బడ్జెట్ రూ. 125 కోట్లు.. ప్రస్తుతం 1000 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని సినీ పంతులు అంచనా వేస్తున్నారు.. మరి టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అని ఆసక్తి నెలకొంది..