Intinti Ramayanam Today Episode October 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ అవని కోసం ఇల్లంతా వెతికాను అని అంటాడు. ఎందుకు వదిన నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటాడు. భరత్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చాడని తెలిసిపోయింది కదా అని అవని అంటుంది.. మీ అన్నయ్య కి ఇచ్చిన డబ్బులు ఎవరు తీసారో అర్థం కావట్లేదు అన్నయ్య. ఖచ్చితంగా ఇంట్లో వల్లే తీసి ఉంటారని నా అనుమానం.. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కచ్చితంగా మన ఇంట్లో వాళ్లే ఈ డబ్బులను తీసుకుని ఉంటారని నా అనుమానం. మాట వినగానే కమల్ రెచ్చిపోతాడు. నిజంగా మన ఇంట్లో వాళ్లే డబ్బులు అన్ని తీసి ఉంటారా వదిన అని అడుగుతాడు. మన ఇంట్లో వాళ్ళు తీయకపోతే ఎవరు తీసి ఉంటారు అని అవని అడుగుతుంది. అయితే నీ మీద పల్లవికి శ్రీయ కి మాత్రమే కోపం ఉంది. వాళ్ళ ఇదంతా చేశారని తెలిస్తే తోలు తీసి డోలు వాయిస్తాను అని కమల్ సీరియస్ అవుతాడు. కమల్ కోపాన్ని చూసిన అవని అందుకే నీకు ఈ విషయం గురించి చెప్పట్లేదు కన్నయ్య అని అంటుంది. రాజేశ్వరికి నిజం చెప్పిన అవని పల్లవి పై డౌట్ ఉన్నట్లు చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేశ్వరి అవనిని ఇంటికి రమ్మని ఫోన్ చేసి పిలుస్తుంది. ఏమైంది పిన్ని అర్జెంట్గా రమ్మని అన్నారు అని అడుగుతుంది. పల్లవి ఒక సూట్ కేసు వాళ్ళ నాన్న చేతికి ఇచ్చి వెళ్లిందమ్మా అది కచ్చితంగా మీ ఇంట్లోంచి తెచ్చి ఉంటుందని నా అనుమానం అది కాదు అవును తెలుసుకోవడానికి నిన్ను రమ్మని పిలిచాను అని రాజేశ్వరి అంటుంది. అయితే రాజేశ్వరి చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని పల్లవి ఆ సూట్ కేసును చూడడానికి వెళుతుంది.. ఆ సూట్ కేసును చూసిన అవని ఇది కచ్చితంగా అదే ఎలా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రధర్ నేను అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలి అందుకే వచ్చాను అని అంటాడు.
అవని కనిపించకుండా ఇంట్లో దాక్కుంటుంది. ఆ తర్వాత చక్రధర్ మాట్లాడేసి వెళ్ళిపోతాడు. నువ్వు డబ్బులు తెచ్చిన సూట్ కేస్ ఇదే పిన్ని దీన్ని నేను తీసుకెళ్తాను ఇంట్లో పెడతాను అసలు దొంగ ఎవరో బయటకు వస్తారు అని అంటుంది. అవని వచ్చిందని తెలుసుకున్న చక్రధర్ డబ్బులను సూట్ కేసును ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి అని అనుకుంటాడు. అయితే రాజేశ్వరితో ఆ సూట్ కేసు తీసుకొస్తే మా ఫ్రెండ్ కి ఇవ్వాలి అని అంటాడు. రాజేశ్వరి పైకి వెళ్లి అవనితో ఈ విషయాన్ని చెప్తుంది. అయితే ఆ డబ్బులు కావాలమ్మా అని అనగానే రాజేశ్వరికి ఆ డబ్బులు ఇచ్చేసి అవని వెళ్లిపోతాను అని అంటుంది.
రాజేశ్వరి మీద అనుమానం వచ్చిన చక్రధర్ బయటికి వెళ్లకుండా అక్కడే ఉంటాడు. ఈ విషయాన్ని పల్లవి తో చెప్పాలని ఫోన్ చేసి చెప్తాడు. అయితే అవని ఇంటికి రాదని పల్లవి ఈ విషయం గురించి మాట్లాడుతుంది. మా ఇంటికి వెళ్లి నువ్వు వెతకవలసిన అవసరం ఏంటి అంటే మా ఇంట్లో ఇంకా డబ్బులు లేవా మేము కోటీశ్వరులు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నట్లు ఉన్నావు అని పల్లవి అడుగుతుంది. ఆ డబ్బులు మీద ఉన్న సీలు అలానే ఉంది నేను బ్యాంకు నుంచి తీసుకొచ్చిన నెంబర్ అలానే ఉంది.
ఆ సూట్ కేస్ మీద ఉన్న గుర్తులు కూడా అలానే ఉన్నాయి. మరి నువ్వు తీయకపోతే ఎవరు తీశారు అని పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది అవని. నేను తీసాను అని తెలిసిపోయింది కదా మరి ఆ డబ్బులు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది పల్లవి. మీ నాన్న నీలాగే తెలివితేటలు ఎక్కువగా అని అనుకుంటాడు కదా తెలివిగా డబ్బుల్ని మాయం చేశాడు వాటిని ఎలా రాబట్టాలో నాకు తెలుసు అని పల్లవితో మాట్లాడటం ఇంట్లో వాళ్ళు వింటారు. అవని అక్క మా ఇంటికి వెళ్లి నేను దొంగ అని అనుమానిస్తూ ఇల్లంతా వెతికిందట అని పల్లవి అంటుంది.
మా ఇంట్లో ఇంక డబ్బులే ఉండవు.. నన్ను అనుమానించాల్సిన అవసరమేంటి? నేను ఏ రోజైనా డబ్బులు తీసానా అని పల్లవి అంటుంది. చూసావా రేపు నన్ను అనుమానించి మా ఇంటికి అయినా వెళుతుంది అని శ్రియా కూడా అంటుంది. నేను అడగాల్సినవన్నీ నువ్వే అడుగుతున్నావు కదా ఇక నేనేమి అడగాలి అని శ్రీకర్ అంటాడు. ఇంట్లో డబ్బులు పోయినప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరిని అనుమానించాలి. వదిన చేస్తున్న దాంట్లో తప్పేంటి అని కమల్ అడుగుతాడు. నానమ్మ గదిలో కూడా డబ్బులు గురించి వెతికింది అంటే నానమ్మ డబ్బులు తీసిందా అని కమల్ అందరినీ నిలదీస్తాడు.
డబ్బులు గురించి ఎంక్వయిరీ చేయాల్సిన అవసరం నీకేంటి అది మా డబ్బు మేం వెతుక్కుంటాం కదా అని అక్షయ్ అంటాడు. పోయింది 5000 10000 కాదు 50 లక్షలు. మీకు ఎలా ఉందో తెలియదు గానీ నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉంది అందుకే వెతుకుతున్న నామీద మీరు నింద వేసినప్పుడు మీకు అది గుర్తుకు రాలేదా అని అవని అక్షయ్ సీరియస్ అవుతుంది. చూశారా అవని పై నింద వేశానని నన్ను ఎలా మాట్లాడుతుందో అని అక్షయ్ అంటాడు. అవని చేస్తుంది 100% కరెక్ట్. అది నీ బిజినెస్ కోసం ఇచ్చిన డబ్బులు. నువ్వు బాధ్యతగా ఆ డబ్బులు ఏమయ్యా అని వెతకాల్సింది పోయి సైలెంట్ గా ఉన్నావు నాకు ఏమన్నాలో అర్థం కావట్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు..
Also Read: నర్మదను ఇరికించిన ప్రేమ.. బతుకమ్మ సంబరాలు.. తెలివిగా తప్పించుకున్న రామరాజు..
మీరిలా అవనీని వెనకేసుకొని వస్తే ఇంకా రెచ్చిపోతుంది అని అక్షయ్ అంటాడు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పల్లవి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఆ అవని కచ్చితంగా మనం డబ్బులు తీశామని తెలుసుకుంది. ఈ విషయాన్ని బయట పెడితే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఇంటికి లై డిటెక్టర్ వాళ్ళు వస్తున్నారు ఆ డబ్బులు ఎవరు తీసారు కచ్చితంగా కనిపెడతారు అని అవని అంటుంది.. ఆ మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..