BigTV English

Mohan Babu: మంచు ఫ్యామిలీకి భారీ షాక్..గుర్తింపు రద్దు కానుందా?

Mohan Babu: మంచు ఫ్యామిలీకి భారీ షాక్..గుర్తింపు రద్దు కానుందా?

Mohan Babu: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబానికి ఇప్పుడు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. ముఖ్యంగా మంచు మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) కి ఉన్నత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విచారణ చేపట్టగా.. పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహించారు. గత మూడు సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి కూడా ఫీజుల రూపంలో సుమారుగా 26 కోట్ల రూపాయలను అదనంగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు.


యూనివర్సిటీ గుర్తింపు రద్దు కానుందా?

అయితే ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్.. 15 లక్షల రూపాయల ఫైన్ వేసింది. అంతేకాదు 15 రోజుల్లోగా 26 కోట్ల రూపాయలను చెల్లించాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ గుర్తింపును కూడా రద్దు చేయాలి అని, ఉన్నత విద్య కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేయడం సంచలనంగా మారింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 15 లక్షల రూపాయల ఫైన్ మోహన్ బాబు యూనివర్సిటీ కట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రద్దు విషయంపై మోహన్ బాబు యూనివర్సిటీ ఎలా స్పందిస్తుందో అనే విషయం ఉత్కంఠగా మారింది.

మనోజ్ చేసిన ఆరోపణలు నిజమేనా?

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో మంచు మనోజ్ (Manchu Manoj), మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య గొడవలు జరిగినప్పుడు కూడా.. మంచు మనోజ్ ఇలాగే విద్యాసంస్థలో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. పైగా కాలేజ్ పై వస్తున్న ఆరోపణలతో పాటుగా ఫిర్యాదులు ఏవైనా ఉంటే తనకు మెయిల్ ద్వారా పంపాలి అని, అప్పట్లో తన ఈ మెయిల్ కూడా ఇచ్చారు మంచు మనోజ్. ఆయా అంశాలను తాను వ్యక్తిగతంగా తన తండ్రి మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇలా తనపై దాడి జరిగింది అని కూడా ఆయన ఆరోపించారు.


మంచు ఫ్యామిలీ రియాక్షన్ ..

దీనికి తోడు విద్యార్థి సంఘాలు కూడా విలేకరుల సమావేశాలు నిర్వహించి, యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యా కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి చూస్తే నాడు మనోజ్ చేసిన ఆరోపణలన్నీ నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరికొంతమంది ఇవి ఆరోపణలు కాదు నిజంగా మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మంచు ఫ్యామిలీకి ఇంత పెద్ద భారీ షాక్ తగలడం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై మంచు ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. బహిరంగ ప్రకటన చేసి తమ పరువు తీశారు అంటూ కోర్టులో కేసు వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

విద్యానికేతన్ సంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి..

మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయం. 2022లోనే శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెంది.. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పాటుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఈ యూనివర్సిటీ ద్వారా తమ భవిష్యత్తును బంగారమయం చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలోనే అవకతవకలు ఏర్పడుతున్నాయని సమాచారం.

also read: Samantha: జోరు పెంచిన సమంత.. బ్రాండ్ అంబాసిడర్ గా ?

Related News

Jana Nayagan: తొక్కిసలాట ఎఫెక్ట్.. జన నాయగన్ వాయిదా .. ?

MAD 3: సైలెంట్ గా షూటింగ్ మొదలైన మ్యాడ్ క్యూబ్.. రిలీజ్ అప్పుడే?

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్‌కు విలన్‌… 3 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

Chiranjeevi: బాసూ.. నీకు 70 ఏళ్లు.. దానికి తగ్గట్లు ఉంటారా

Dulquer Salmaan : హీరో కార్ల కలెక్షన్స్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఫెర్రారీ నుండి ల్యాండ్ రోవర్..

#VD15: విజయ్ కొత్త మూవీ పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ అప్పుడే?

Kantara Chapter 1: అక్కడ ‘కాంతార 2’ కలెక్షన్స్ దారుణం.. భారీ నష్టం తప్పదా..?

Big Stories

×