Yograj Singh: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని కెప్టెన్సీలోనే టీమిండియాలోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్, అంచలంచలుగా ఎదిగారు. ఐపీఎల్ ద్వారా బాగా రాణించి, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అలాంటి మహమ్మద్ సిరాజ్ గురించి యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి పెద్ద ఆల్ రౌండర్ అయ్యే శక్తి టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచనలు చేశారు యోగరాజ్ సింగ్.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
మహమ్మద్ సిరాజ్ పై యువరాజు సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా మహమ్మద్ సిరాజ్ బాగా రాణిస్తాడని వెల్లడించారు యోగరాజ్. ఆ సత్తా కేవలం మహమ్మద్ సిరాజ్ కు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆల్ రౌండర్ గా సిరాజ్ మారే ఛాన్సులు ఉన్నాయని, దీనికోసం కాస్త కష్టపడాలని తెలిపారు. తన చేతిలోకి మహమ్మద్ సిరాజ్ వస్తే, అతన్ని అత్యంత ప్రమాదకరమైన ఆల్ రౌండర్ గా మారుస్తానని శపథం చేశారు.
నిలబడి అలాగే కూర్చొని సిక్సులు కొట్టే సత్తా సిరాజ్ దగ్గర ఉందని ఈ సందర్భంగా వివరించారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదని తెలిపారు. టీమిండియాలో మహమ్మద్ సిరాజ్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు యోగరాజ్. బుమ్రా కంటే ఎక్కువగా సిరాజ్ ఆడతాడని కూడా ఈ సందర్భంగా తెలిపారు. గాయాలు లేకుండా ప్రతి మ్యాచ్ ఆడగల సత్తా మహమ్మద్ సిరాజ్ సొంతమన్నారు. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే సిరాజ్, అదే స్థాయిలో సిక్సులు కూడా కొడతాడని వెల్లడించారు.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
మహమ్మద్ సిరాజ్ పర్ఫామెన్స్ పై మాజీ క్రికెటర్లు అందరూ మెచ్చుకుంటుంటే గౌతమ్ గంభీర్ మాత్రం అతన్ని తొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నిదర్శనమే హర్షిత్ రాణా. టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ లోను హర్షిత్ రాణా పేరు కచ్చితంగా ఉంటుంది. దీంతో అతడు పర్మినెంట్ ప్లేయర్ గా మారిపోయాడు. గిల్ అలాగే హర్షిత్ రాణా ఉంటేనే టీమ్ ఇండియా ఆడుతున్నట్లు వ్యవహారం నడుస్తోంది. మహమ్మద్ సిరాజు లాంటి ప్లేయర్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వకుండా కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇకపై మహమ్మద్ సిరాజును టెస్టులతో పాటు వన్డేలు అలాగే టి20లో తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. అప్పుడే టీమిండియా కు మంచి విజయాలు దక్కుతాయని అంటున్నారు. మరి బిసిసిఐ ఇకనైనా మారుతుందో లేదో చూడాలి.
Yograj Singh believes Siraj possesses the potential to become one of cricket’s greatest all-rounders 😮 pic.twitter.com/dvU47h3M6j
— CRICKETNMORE (@cricketnmore) October 7, 2025