K Ramp: కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా మూవీ కే – ర్యాంప్.. ఈ సినిమా ఈరోజు అనగా అక్టోబర్ 18న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. జైన్స్ నాని డైరెక్షన్లో రాకేష్ దండా నిర్మాతగా చేసిన ఈ మూవీ థియేటర్లలో మొదటి షోతోనే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే కే ర్యాంప్ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం ని మీడియా మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా ఈ సినిమాని విడుదలకి ముందే హీరో కిరణ్ అబ్బవరం ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది అని చెప్పారు. కానీ ఈ సినిమాలో కొన్ని బూతు సీన్స్,మాటలు ఉన్నాయి.
వాటి గురించి మీడియా కిరణ్ అబ్బవరం టార్గెట్ చేసింది.ఈ ప్రెస్ మీట్ లో కే ర్యాంప్ అనే టైటిల్ జస్ట్ఫికేషన్ ఏంటి అని అడగగా.. ఇది కంప్లీట్లీ మాసివ్ ఫిల్మ్.. కొన్ని సినిమాలు క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఉంటాయి కదా.. అలాంటి క్యారెక్టర్ బేస్డ్ సినిమా ఇది. ఈ సినిమాలో హీరో ఏం చేసినా ఎంజాయ్ చేసే వైబ్ లో ఉంటుంది కదా.. అలా కే అంటే కుమార్.. కుమార్ ర్యాంప్ .. ఇక యూత్ ఫుల్ స్టోరీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడి ఉంటుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా..ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడొచ్చు అని చెప్పారు.
దీనికి జర్నలిస్టు కౌంటర్ ఇస్తూ.. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన కంటెంట్ లో బూతు పదం, బూతు మీనింగ్ వచ్చే అర్థం ఉంది. అలాంటప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎలా చూస్తారు. ఈ సినిమాలో మీరు వాడిన లూడో డైలాగ్ సీన్ సెన్సార్ తీసేసారో లేదో కానీ ఆ బూతు పదాన్ని అందరూ కూర్చొని ఎలా చూస్తారు.. అని జర్నలిస్టు అడగడంతో..దాన్ని బాలేదని మేమే తీసేద్దాం అనుకున్నాము. సెన్సార్ కూడా కట్ చేసింది అని ఆన్సర్ ఇవ్వడంతో లూడో డైలాగ్ ఎందుకు పెట్టారు పబ్లిసిటీ కోసమే పెట్టారా అని జర్నలిస్ట్ అడగగా.. పబ్లిసిటీ అని ఏం లేదు సార్..నేను పోషించిన క్యారెక్టర్ అలాంటిది.పవిత్రంగా ఉంటే వర్కౌట్ అవ్వదు అంటూ కిరణ్ అబ్బవరం ఆన్సర్ ఇచ్చారు.
దానికి జర్నలిస్టు మాట్లాడుతూ.. కంప్లీట్ గా ఫ్యామిలీ కూర్చొని చూసే సినిమా ఎంజాయ్ చేసే సినిమా అంటున్నారు. మరి లూడో డైలాగ్ ని మీ ఇంట్లో మీ తల్లితోనో, మీ చెల్లితోనో వాడతారా అని అడగడంతో.. నేను సినిమాలో నా తల్లితో చెల్లితో చేయలేదు. ఫ్రెండ్ తో ఆ మాట అన్నాను అంటూ హీరో క్లారిటీ ఇచ్చారు.
కానీ హీరో క్లారిటీ ఇచ్చినప్పటికి ఆ జర్నలిస్ట్ తగ్గకుండా మరీ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా.. మీరు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఎలా అంటారు అంటూ షాక్ ఇచ్చారు.దాంతో ఎలాంటి ఆన్సర్ చెప్పాలో తెలియని కిరణ్ అబ్బవరం ఇప్పటికే ఈ ప్రశ్నకు నేను 4 ప్రెస్ మీట్ లలో ఆన్సర్ ఇచ్చాను అని అంటే.. మీరు ఆన్సర్ ఇచ్చారు కావచ్చు కానీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అని ఎలా చెప్పగలరు. పబ్లిసిటీ స్టంట్ కోసమే మీరు ఆ డైలాగ్ ని బయటికి వదలారు. ఒకవేళ సెన్సార్ కట్ చేయకపోతే ఆ డైలాగ్ ని అలాగే ఉంచేవారా అంటూ జర్నలిస్టు కిరణ్ అబ్బవరాన్ని ఇరుకున పడేశారు. దానికి కిరణ్ అబ్బవరం మీరు నా నుండి ఏం ఆన్సర్ రాబట్టాలనుకుంటున్నారో తెలియదు.కానీ నా దగ్గర నో ఆన్సర్ అంటూ చెప్పేశారు.
ఆ తర్వాత సీనియర్ నటుడు నరేష్ మైక్ తీసుకొని ఒకప్పుడు 70’s లో టూ పీస్ బికినీ వేసుకోవడం నేరంగా చూసేవారు.కానీ ఆ తర్వాత ఎంతోమంది బికినీ వేసుకున్నారు. అలాగే 80స్ లో లిప్ లాక్ సీన్ ని సెన్సార్ కట్ చేసింది. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా ఇలాంటి సీన్స్ వస్తున్నాయి. అలా కాలానికి తగ్గట్టు అందరూ మారుకుంటూ వస్తున్నారు అని మీడియాకి గట్టి కౌంటర్ ఇచ్చారు నరేష్.