Suryakumar Yadav : ప్రస్తుతం ఆసియా కప్ 2025 జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సూపర్ 4 కి దూసుకెళ్లింది. సూపర్ 4 కి చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ముఖ్యంగా #Boycott నినాదాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ప్రతీ భారతీయుడిని గర్వపడేలా చేసింది టీమిండియా. పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు టీమిండియా ప్లేయర్లు ఆసక్తికనబరచలేదు. మరోవైపు మ్యాచ్ ముగిసిన వెంటనే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి చేరుకున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.
Also Read : IND Vs PAK : పాకిస్థాన్ కు మరో అవమానం…జాతీయ గీతం కాకుండా డీజే పాటలు
భారత్ డ్రెస్సింగ్ రూమ్ కి డోర్లు వేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాకుండా పహల్గామ్ బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నాడు సూర్యకుమార్ యాదవ్. “మేము పహల్గామ్ బాధితులకు అండగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ విజయాన్ని మేము భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. వారు మనల్ని ఎల్లప్పుడూ ఇన్ స్పైర్ చేస్తారని భావిస్తున్నా” అంటూ తన ప్రసంగాన్ని ముగించేశాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అదుర్స్ అని.. అదేవిధంగా అతని బ్యాటింగ్ గురించి కూడా పొగడ్తలతో ముంచెత్తారు టీమిండియా అభిమానులు. వాడు నిజంగానే మగడ్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు.
మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ జట్టు భారత్ కి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో రెండింటిలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు తొలుత పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. కానీ పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి మట్టి కరిపించడం మేలు అని అభిప్రాయపడ్డారు కొంత మంది. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ తో ఒకసారి, మైదానంలో ఇవాళ మరోసారి పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వేదిక ఏదైనా దాయాదికి బుద్ది చెప్పాల్సిందే అంటున్నారు. టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ని గ్రౌండ్ లో అవమానించారు. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తరువాత సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మైదానం నుంచి వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు ఎవ్వరూ గ్రౌండ్ లోకి వచ్చి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సాధారణంగా మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థిని గౌరవిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తారు. మరోవైపు టాస్ వేసే సమయంలో కూడా సూర్యకుమార్ పాకిస్తాన్ కెప్టెన్ తో కరచాలనం చేయలేదు.
We stand by the victims of the families of Pahalgam terror attack. We express our solidarity. We want to dedicate today's win to all our Armed Forces who showed a lot of bravery. Hope they continue to inspire us all and we give them more reasons on the ground whenever we get an… pic.twitter.com/stkrqIEBuE
— BCCI (@BCCI) September 14, 2025