Mirai: సినిమా బాగుంటే పెద్దవాళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతారో.. చిన్న పిల్లలు కూడా అలాగే అట్రాక్ట్ అవుతారు. కొన్ని సూపర్ హీరోల సినిమాలకు చిన్నపిల్లలు మరీ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కేవలం సినిమాలకే కాదు పాటల విషయంలో కూడా ఇంతే.. కొన్ని కొన్ని పాటలు పెద్దవాళ్లతో పాటు చిన్న పిల్లల మనసు కూడా దోచుకుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇలాంటిదే..ఒక పాప సినిమాలో తనకి ఇష్టమైన పాట లేదని తెగ ఏడ్చేసింది..ఆ పాప ఏడుపు చూసినా వాళ్ళ పెద్దవాళ్లు వీడియో షూట్ చేసి మరీ డైరెక్టర్ మాకు అన్యాయం చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆ చిన్నారి ఏడుపుకు కారణమైన ఆ పాట ఏంటి? ఏ సినిమా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తేజ సజ్జా (Teja sajja) హీరోగా తెలుగు ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ గా తెరకెక్కిన తాజా మూవీ మిరాయ్.. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమాకి మొదటి షో నుండే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దాంతో సినిమా విడుదలైన ఈ రెండు, మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు వస్తున్నాయి.. అంతా బాగానే ఉంది కానీ ఒక్కటి తగ్గింది పుష్ప అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. మరి ఇంతకీ తగ్గిన ఆ ఒక్కటి ఏంటయ్యా అంటే.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఉర్రూతలూగించిన పాట.. అదే “వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే”.. ఈ పాట విడుదలకు ముందు ప్రతి ఒక్కరి నోట్లో నానింది.
పాట లేక పోయేసరికి కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి..
కానీ తీరా సినిమా విడుదలయ్యాక.. థియేటర్లోకి వెళ్లి చూస్తే సినిమా నుండి డైరెక్టర్ ఆ పాటనే లేపేశారు. వైబ్ ఉంది పాట సినిమా నుండి తీసేయడంతో చాలామంది నిరాశ పడ్డారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ షో చూసిన చాలామంది ఆడియన్స్ .. నెక్స్ట్ షో నుంచి అయిన ఈ పాటను యాడ్ చేసి పెట్టండి అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమాలో పాటని యాడ్ చేయలేదు. అయితే తాజాగా థియేటర్లో సినిమా చూసిన ఒక పాప వైబ్ ఉందిలే అనే పాట లేకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయింది. ఆ పాప వైబ్ ఉందిలే పాట సినిమాలో లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యి ఏకంగా ఏడ్చేసింది కూడా..
మునుముందైనా పాటను యాడ్ చేస్తారా?
ఈ సినిమాలో పాట లేదు అంటూ ఆమె ఏడ్చిన వీడియోని ఆ పాప ఫ్యామిలీ వాళ్ళు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతోపాటు చిత్ర బృందాన్ని ట్యాగ్ చేయడంతో.. ట్యాగ్ చేయడంతో జనాలు ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు. అయితే మిరాయ్ మూవీ లో వైబ్ ఉందిలే సాంగ్ మిస్ అయిన ఫిలింగ్ ఆ చిన్నారిలో మాత్రమే కాదు ప్రతి ఒక్కరిలో ఉంది. మంచి పాటను సినిమా నుండి లేపేసారే అంటూ సినిమా చూసిన చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ పాట లిరిక్స్,మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు. అంతలా అట్రాక్ట్ అయిన పాటని సినిమా నుండి తీసేసరికి చాలామంది పెదవి విరుస్తున్నారు. మరి చూడాలి ప్రేక్షకుల డిమాండ్ మేరకు ముందు ముందు డైరెక్టర్ సినిమాలో ఈ పాటను యాడ్ చేస్తారా అనేది.
ALSO READ:Karan Johar: హైకోర్టును ఆశ్రయించిన కరణ్ జోహార్.. ఐశ్వర్య దారిలోనే!