Pawan Kalyan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం రచయితల సంఖ్య చాలా తక్కువ. మంచి పేరు సాధించిన రచయితలలో కోన వెంకట్ ఒకరు. కేవలం రచయిత గానే కాకుండా నిర్మాతగా కూడా కోన వెంకట్ సినిమాలు చేస్తూ ఉంటాడు. శ్రీను వైట్ల, కోన వెంకట్ కాంబినేషన్ ఒకప్పుడు మంచి సక్సెస్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలో అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేశాయి. కోన వెంకట్ దూరమైన తర్వాత శ్రీను వైట్ల హిట్ సినిమా కొట్టలేకపోయారు.
అయితే కొన్ని పరిస్థితులు బట్టి మనుషుల వ్యక్తిత్వాలు మారుతాయి అంటుంటారు. కోన వెంకట్ విషయంలో అదే జరిగింది. ఒక్క టైం లో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పేరును విపరీతంగా వాడుకునే వాళ్ళు. సినిమాలలో కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు ఊరికే పెట్టేవాళ్ళు. సందర్భం లేకపోయినా కూడా పవన్ పేరును తీసుకొచ్చేవాళ్ళు. గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవడంతో పవన్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే కొంతమంది పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ ను కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ తనకు ప్రాణ స్నేహితుడు అని చెప్పేవాడు కోన వెంకట్. కోన వెంకట్ పవన్ కళ్యాణ్ కలిసి కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన బాలు సినిమాకి పనిచేశారు. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ కూడా అందుకోలేదు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు. ఒక తరుణంలో జగన్ నిజం, చంద్రబాబు అబద్ధం, పవన్ కళ్యాణ్ అమాయకత్వం అంటూ కళ్యాణ్ ను కామెంట్ చేశాడు కోన వెంకట్. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది. విపరీతమైన ట్రోలింగ్ కూడా అప్పుడు కోన వెంకట్ పైన వచ్చింది.
కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ లో కోన వెంకట్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. చాలామంది దానిని కోట్ చేస్తూ వీడు ఫ్రెండ్ కాదు ఫ్రాడ్ అంటూ కోన వెంకట్ ను విపరీతంగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాంటివారిని దగ్గరికి ఇవ్వకండి అంటూ రిక్వెస్టులు కూడా చేస్తున్నారు.
మామూలుగా ఒక ఫోటో పెట్టినప్పుడు కొంతమంది కామెంట్స్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఎక్కువమంది అబ్యుజ్ కామెంట్స్ చేస్తారు అనే ఉద్దేశంతోనే కామెంట్స్ ఆఫ్ చేస్తారు. ఇక కోన వెంకట్ కి కూడా ఎక్కడో ఒక మూల తాను తప్పు చేశానని అనిపించి ఉంటుంది. అందుకే కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసాడు. మరోవైపు హరీష్ శంకర్ కోన వెంకట్ కి క్లోజ్ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో అడుగుపెట్టే అవకాశం దక్కింది.
Also Read: Bigg Boss 9 : ట్విస్ట్ మీద ట్విస్ట్, వరస్ట్ కామనర్స్, హౌస్ లో నుండి వెళ్లిపోయే వరకు ఏమి తినను