BigTV English

Upendra: హీరో భార్య ఫోన్ హ్యాక్.. డబ్బులు పంపించాలని డిమాండ్

Upendra: హీరో భార్య ఫోన్ హ్యాక్.. డబ్బులు పంపించాలని డిమాండ్

Upendra: ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఏ రేంజ్ లో విజృంభిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామందిని టార్గెట్ చేస్తూ.. వారిని భారీగా ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సైబర్ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా.. ఇటు ప్రజలు, అటు సెలబ్రిటీలు ఎంత పగడ్బందీగా భద్రతను మెయింటైన్ చేసినా సరే ఏదో ఒక సందర్భంలో ఏదో లోగా మోసపోతూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.


ఉపేంద్ర ఫోన్ ను హ్యాక్ చేసిన దుండగులు..

ముఖ్యంగా ఫోన్లను హ్యాక్ చేయడం.. తమ సొంత వారిలాగే మాట్లాడుతూ ఇతరుల నుండి డబ్బులు లాక్కోవడం, ఫోటోలను ఇతర వెబ్సైట్లో ఉపయోగించడం..ముఖ్యంగా వారి ఫోటోలను ఇతర కంటెంట్ కోసం ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని చెబుతున్నారు. అయితే కొంతమంది హ్యాకర్స్ మాత్రం ప్రత్యేకించి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. వారి పేరిట ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తూ మరింత మోసానికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ శాండిల్ వుడ్ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra ) తో పాటూ ఆయన భార్య ప్రియాంక ఫోన్ ని కూడా కొంతమంది దుండగులు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

also read:Mirai: పిల్లలు ఏడుస్తున్నారు.. ఆ పాట పెట్టండయ్యా, పాప చూడండి ఎలా ఏడుస్తుందో!


హెచ్చరిక సందేశం పంపిన ఉపేంద్ర..

ఉపేంద్ర ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ.. “అందరికీ నమస్కారం.. దయచేసి నేను అందరికీ ఒక హెచ్చరిక సందేశం పంపుతున్నాము. ప్రియాంకకు ఒక నంబర్ నుండి కాల్ వచ్చింది. హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి హ్యాకర్ కాల్ చేశాడు. కానీ నాకు తెలియకుండానే నా మొబైల్ నుండి కూడా వీరు కాల్ చేశారు. కాబట్టి మా ఇద్దరి ఫోన్ లు హ్యాక్ అయ్యాయి. ప్రియాంక పేరుతో.. నా మొబైల్ నుండి మీకు ఎవరైనా కాల్ చేసి డబ్బు అడిగినా.. ఏదైనా సందేశం వచ్చినా దయచేసి దానిని పంపవద్దు. ఇప్పుడే మేము పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాం” అంటూ ఆయన తెలిపారు.

ఉపేంద్ర భార్య ఫోన్ కూడా హ్యాక్..

ఇదే విషయాన్ని అటు ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా సోషల్ మీడియా వేదికగా హెచ్చరిక అనౌన్స్మెంట్ చేసింది. “ఒక దుండగుడు సెలబ్రిటీ జంటగా మా పరిచయస్తులను సంప్రదించడం మొదలుపెట్టాడు. యుపిఐ బదిలీల ద్వారా డబ్బు అడిగాడు.దీనిని మేము త్వరగా కనుగొన్నప్పటికీ మా పేర్లపై ఇప్పటికే అనేక సందేశాలు వారికి వెళ్ళిపోయాయి. దయచేసి మా ఫోన్లు హ్యాక్ అయ్యాయని మీకు తెలియజేయాలనుకుంటున్నాము. కాబట్టి ఎవరు కూడా హ్యాకర్ కోరినట్లుగా యూపీఐ లో మాకు ఎటువంటి డబ్బులు పంపకండి. ఇప్పుడే మేం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వబోతున్నాం” అంటూ ఆమె స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే.. సెలబ్రిటీల ఫోన్ల నే హ్యాక్ చేశారు కాబట్టి.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి అంటూ ఈ సెలబ్రిటీ జంట సోషల్ మీడియా వేదికగా అవేర్నెస్ కల్పించారు.

Related News

Lady oriented Movies : టాప్ 5 లేడీ ఓరియెంటెడ్ మూవీస్… మీ ఫేవరెట్ సినిమా ఉందా ?

Mirai: పిల్లలు ఏడుస్తున్నారు.. ఆ పాట పెట్టండయ్యా, పాప చూడండి ఎలా ఏడుస్తుందో!

Karan Johar: హైకోర్టును ఆశ్రయించిన కరణ్ జోహార్.. ఐశ్వర్య దారిలోనే!

Malaika Arora: ఇల్లు అమ్మి కారు కొన్న హాట్ బ్యూటీ..

Kotha Lokah: ఊచకోత కోస్తున్న కొత్తలోక.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Meena: సౌందర్యతో పాటూ నేను కూడా చచ్చిపోయేదాన్ని… మీనా సంచలన కామెంట్!

Manchu Manoj: మిరాయ్ హిట్ అయినా హ్యాపీగా లేని మనోజ్.. కారణం అదేనా

Big Stories

×