Kotha Lokah:కళ్యాణీ ప్రియదర్శన్(Kalyani Priyadarshan).. మలయాళ నటిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. తొలిసారి లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఇండియన్ సినిమాలలో సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. అయితే అలా వచ్చిన చిత్రాలలో హీరోలకి అవకాశాలు లభించడం చాలా అరుదు.. అలాంటిది.. కళ్యాణి సూపర్ హీరో పాత్రలో నటించిన తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. అలా ‘లోక చాప్టర్ వన్:చంద్ర’ టైటిల్ తో మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. ఆ తర్వాత తెలుగులో ‘కొత్తలోక’ అంటూ విడుదల చేశారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకొని దూసుకుపోతోంది.
బాక్స్ ఆఫీస్ వద్ద ఊచ కోత కోస్తున్న కొత్తలోక..
డొమినిక్ అరుణ్ (Dominic Arun) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి.. ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) నిర్మాతగా వ్యవహరించారు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగులో ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తూ సంచలనం సృష్టిస్తోంది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటివరకు రూ.116 కోట్ల నెట్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ.234 కోట్ల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఇకపోతే 15 రోజుల్లోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. మొత్తానికి అయితే కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఊహించని రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోసిందని చెప్పవచ్చు.
కొత్తలోక సినిమా స్టోరీ..
సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చంద్ర (కళ్యాణి ప్రియదర్శన్) కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే ఒక సమయంలో ఆమె బెంగళూరుకి వస్తుంది. తన అతీంద్ర శక్తుల్ని దాచిపెట్టి.. ఒక సాధారణ అమ్మాయిలాగా బ్రతుకుతుంది .చంద్ర ను చూసి సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసి వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అవుతారు. అయితే ఒక రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం మొత్తం తలకిందులవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ.. ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతం ఏంటి? ఆమెకు ఎస్ఐ నాచియప్ప తో గొడవ ఏంటి? చివరికి ఏమైంది? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అటు థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో.. ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
ALSO READ:Meena: సౌందర్యతో పాటూ నేను కూడా చచ్చిపోయేదాన్ని… మీనా సంచలన కామెంట్!