E-Paper
Advertisement

Director Maruthi: ఆ ఇద్దరు కుర్ర హీరోలతో దర్శకుడు మారుతి.. రాజా షాబ్ తర్వాత మరో ప్రయత్నం..!

Director Maruthi: ఆ ఇద్దరు కుర్ర హీరోలతో దర్శకుడు మారుతి.. రాజా షాబ్ తర్వాత మరో ప్రయత్నం..!
Advertisement

Director Maruthi:
టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన చివరిగా తెరకెక్కించిన సినిమా రాజా సాబ్ భారీ బడ్జెట్‌తో రూపొందినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా మారుతి కెరీర్‌లో ఒక పెద్ద తప్పిదంగా మారిందనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమా తర్వాత ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ కూడా ఎక్కువయ్యాయి. దీంతో మారుతి మానసికంగా కూడా ఒత్తిడిలోకి వెళ్లినట్టు సమాచారం.

మరోసారి ప్రయత్నం..!

ఈ పరిస్థితుల్లో మారుతి ఇప్పుడు ఒక బలమైన కథతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రస్తుతం కేరళలో ఉంటూ కొత్త స్క్రిప్ట్ రాయడంపై పూర్తిగా దృష్టి పెట్టినట్టు టాక్. గతంలోనే ఆయన మైత్రి మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నారు. అందుకే త్వరగా సినిమా మొదలుపెట్టాలనే ఒత్తిడి కూడా ఆయనపై ఉంది. అయితే, సినిమా ప్రారంభించాలంటే ముందుగా సరైన హీరోను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కానీ అదే ఇప్పుడు మారుతికి పెద్ద తలనొప్పిగా మారింది.

Advertisement

మారుతి ఆలోచనలో ఉన్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. వరుణ్ తేజ్ తాజాగా కొరియన్ కనకరాజు అనే సినిమా పూర్తి చేశారు. అయితే గతంలో మైత్రి సంస్థతో వరుణ్ తేజ్ చేయాల్సిన మరో ప్రాజెక్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో రద్దయింది. దీంతో వరుణ్ తేజ్ కూడా కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

ఇద్దరు హీరోలది అదే పరిస్థితి..!

మరోవైపు రామ్ పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేదు. ఆయన చివరి సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ ఫలితంతో రామ్ కూడా తదుపరి సినిమాను చాలా ఆలోచించి ఎంపిక చేయాలని భావిస్తున్నారని టాక్.
ఇంకా చెప్పాలంటే..యంగ్ హీరోలందరూ ఇప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందువల్ల మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ మొదలుపెట్టాలంటే కొంతకాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి అయినా సరైన కథ, సరైన హీరోతో మారుతి మళ్లీ హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

ALSO READ: James Cameron: హాలీవుడ్‌కు జేమ్స్ కామెరాన్ హెచ్చరిక.. ఇక మిగిలేది ఏమీ లేదంటూ..!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×