Madharasi Censor Report Details: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. వైవిధ్యమైన కథలతో ఆయన ఫ్యాన్స్ని అలరిస్తుంటారు. తన సినిమాలు, కథలో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. అంతేకాదు ఈ హీరో పాత్రలతో ప్రమోగాలు చేస్తుంటాడు. అలా రెమోళి చిత్రంలో లేడీ గెటప్తో అలరించాడు. అమరన్లో ఎలియన్తో ఫ్రెండ్షిప్ చేశాడు. డాక్టర్ వరుణ్‌లో ఆయన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా వైవిధ్యమైన కథ, పాత్రలతో ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంటాడు. ఇక ఈసారి శివ కార్తికేయన్.. మదరాసి అనే సినిమాతో వస్తున్నాడు.
ఘాటీకి పోటీగా మదరాసి
‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ తర్వాత అతడు నుంచి వస్తున్న చిత్రమిది. పైగా తమిళ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార పోసర్ట్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 5న తమిళంతో పాటు తెలుగు, హిందీలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ టీం ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసింది. దీనికి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీ విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది. దీంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.
ఆ సీన్లపై సెన్సార్ అభ్యంతరం
ఫుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఈ చిత్రానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్పై బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అసభ్యకరమైన పదాలు ఎక్కువ వాడారని, ఆ సన్నీవేశాలను మ్యూట్ చేయాలని బోర్డు ఆదేశించింది. హిందీలో వాడిన బె** చోత్, మా** చోత్, మా** చోత్, వంటి అసభ్యపదాలను తొలగించాలని, లేదా అవి వచ్చిన చోట మ్యూట్ చేయాలని తెలిపింది. అలాగే మూవీలోని ఓ సీన్లో యూపీ, బిహార్, పంజాబ్ రాష్ట్రాల గురించి అభ్యంతకరంగా చూపించారని, వాటిని ఆ సీన్ తొలగించడం లేదా మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది.
Also Read: Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ‘కి సెన్సార్ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!
అలాగే వయిలెన్స్ ఎక్కువగా సీన్స్, గన్ షాట్స్ వంటి సన్నివేశాలను తొలగించాలని మూవీ టీంకి సూచింది. అలాగే రక్తం కనిపంచే సన్నివేశాలను డార్క్ చేయాలని తెలిపింది. అలాగే మోస్ట్ వయిలెన్స్ గా ఉన్న యాక్షన్ సీన్స్ ఓ స్కూల్ పిల్లాడు తన చేతికి నిప్పు అట్టించుకున్న సన్నివేశాల నిడివి తగ్గించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. అలా మొత్తంగా ఈ సినిమా ఒక నిమిషం 19 సెకన్ల నిడివి తగ్గించారట. సెన్సార్ ఇచ్చి కట్స్ అనంతరం మదరాసి మూవీ నిడివి మొత్తం 167 నిమిషాలు. అంటే 2 గంటల 47 నిమిషాలుగా ఉందట. శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సప్త సాగరాలు ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. శ్రీ లక్ష్మి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న తమిళ్, తెలుగు, హిందీలో విడుదల కానుంది.