BigTV English

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Anushka Shetty: సూపర్ సినిమా ద్వారా అనుష్క శెట్టి (Anushka Shetty)టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అనుష్క అనంతరం ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.. ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తున్న అనుష్క రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన బాహుబలి (Bahubali)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత అనుష్క తన వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి స్థాయిలో సినిమాలను తగ్గించారని చెప్పాలి.


ఘాటీ ప్రమోషన్లలో స్వీటీ…

ఇక బాహుబలి తర్వాత అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే త్వరలోనే డైరెక్టర్ కృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ (Ghaati)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. అయితే అనుష్క కెమెరా ముందుకు రాకపోయినా ఫోన్ కాల్స్ ద్వారా సినిమాకు కావలసినంత ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె బాహుబలికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.


డాక్యుమెంటరీగా బాహుబలి…

ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాని డాక్యుమెంటరీగా రూపొందించి నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరహాలోనే బాహుబలి డాక్యుమెంటరీ కూడా రాబోతుందని అనుష్క వెల్లడించారు. ఇందులో భాగంగా తనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని ఈమె తెలియజేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీ సంస్ధలో ప్రసారం కాబోతోందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బాహుబలి సినిమా డాక్యుమెంటరీ రాబోతుందనే విషయం అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేస్తుంది.

బాహుబలి ది ఎపిక్..

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా తిరిగి ప్రేక్షకుల ముందు రాబోతుంది. బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరుతో ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇలా ఒకవైపు బాహుబలి ది ఎపిక్ తో పాటు బాహుబలి డాక్యుమెంటరీ కూడా రాబోతుందనే విషయం అభిమానులను ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Kishkindha Puri: కిష్కిందపురి బిజినెస్.. టార్గెట్ చాలా చిన్నదే… కానీ సమస్య ఇదే

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Big Stories

×