Udaya Bhanu: టాలీవుడ్ సినీ ఒకప్పుడు యాంకర్ అంటే అందరికీ టక్కున ఉదయభాను(Udaya Bhanu) పేరు గుర్తుకు వచ్చేది. ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గాను నటిగాను ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూ ఉండేవారు. అయితే కొన్ని కారణాలవల్ల ఇటీవల ఈమె సినిమాలకు అలాగే యాంకర్ గా కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారని చెప్పాలి. ఇకపోతే త్వరలోనే ఉదయభాను‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సత్యరాజ్ (Satya Raj)ప్రధానపాత్రలో నటించగా, ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.
త్రిబాణధారి బార్బరిక్ ..
ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ఇతర అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయభాను ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.
అందుకే ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది…
గత కొంతకాలంగా ఉదయభాను ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నేపథ్యంలో తనకు అవకాశాలు రాక దూరంగా ఉన్నారా? లేకపోతే అవకాశాలు వచ్చిన ఈమె సినిమాలు చేయలేదా? అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఎదురయింది. అయితే తనకు చాలా అవకాశాలు వచ్చాయని, ఆ పాత్రలలో పెద్దగా ప్రాధాన్యత లేదనిపించడం వల్లే తాను సినిమాలు చేయలేకపోయాను అంటూ ఈ సందర్భంగా ఇండస్ట్రీకి వచ్చిన గ్యాప్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే చిరంజీవి (Chiranjeevi) గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రావడంతో ఇప్పటివరకు ఎక్కడ తెలియచేయని విషయాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.
అదే నా మొదటి ఫోన్…
చిరంజీవి గారికి నేనంటే చాలా ఇష్టమని, నాకు సంబంధించి ఏ చిన్న విషయం గురించి అయినా ఫోన్ చేసి నన్ను అభినందించడం, ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఓసారి నాకు చిరంజీవి గారు ఫోన్ గిఫ్టుగా ఇచ్చారని ఉదయభాను తెలిపారు. చిరంజీవి గారు ఇచ్చిన ఆ ఫోనే నా మొదటి ఫోన్ అంటూ ఈ సందర్భంగా గతంలో చిరంజీవి తనకు ఇచ్చిన కానుక గురించి ఉదయభాను బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా చిరంజీవిగారి పుట్టినరోజున మా సినిమా కూడా విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈమె తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక తాజగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన “ఇస్కితడి ఉస్కితడి” అనే పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమాలో ఉదయభాను లుక్ కూడా అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత తిరిగి వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమైన ఉదయభానుకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Hrithik Roshan: నాలో మార్పు వచ్చింది…మీరు ప్రయత్నించండి…సలహా ఇచ్చిన హృతిక్ రోషన్!