Hrithik Roshan: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) ఒకరు. హృతిక్ రోషన్ తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా నటుడిగా ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన త్వరలోనే వార్ 2 సినిమా (War 2 Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన అభిమానులకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారని చెప్పాలి.
సోషల్ మీడియాకు దూరంగా…
ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియాలోనే తమ జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాకు దూరం కావటం వల్ల మనలో మనకు తెలియకుండానే ఎన్నో మార్పులు జరుగుతాయని ఇటీవల ఎంతో మంది సెలబ్రిటీలు కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నటుడు హృతిక్ రోషన్ కూడా సోషల్ మీడియాకు(Social Media) దూరంగా ఉన్నారని తెలియజేశారు. ఈ విషయం గురించి హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. నిత్యం సోషల్ మీడియాలోనే కాలం గడపడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటో నేను తెలుసుకున్నానని తెలిపారు.
జ్ఞానోదయం అయింది…
ఈ విషయంలో నేను అందరికీ ఇచ్చే సలహా ఒకటే కనీసం ఒక వారం రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కోసం ప్రయత్నం చేయండి. నేను ఇలాగే చేయటం వల్ల నాలో ఏదో తెలియని మార్పు వచ్చింది, నాకు జ్ఞానోదయం అయింది అంటూ ఈ సందర్భంగా తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ మీరు కూడా సోషల్ మీడియా డిటాక్స్ కావాలి అంటూ సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన వార్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా…
అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)కూడా నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై సౌత్ ఇండస్ట్రీలో కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ కు ఇది మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 సంబరాలలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించిన కటౌట్లను ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఇదే రోజున రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొనిందని చెప్పాలి.
Also Read: Jr.NTR: ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ పై తళుక్కుమన్న తారక్…ఫిదా అవుతున్న ఫ్యాన్స్!