Cloud Burst: ఉత్తరాఖండ్ రాష్టంలో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా ఉత్తరకాశీ జిల్లాలోని థరాలీ గ్రామంలో మంగళవారం భారీ క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. ఈ సంఘటన గంగోత్రీ ధామ్ సమీపంలో జరిగింది. దీని వల్ల కొండలపై నుంచి వరద నీరు అతి వేగంతో పొంగిపొర్లుకుంటూ కిందకు వచ్చేసింది. కొండచరియలు విరిగిపడి గ్రామాల మీదకు వరద సమూహంతో దూసుకొచ్చాయి. భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడి (Landslides) క్షణాల్లోనే గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాశాయి. దీంతో గ్రామంలో వంద మందికి పైగా జలసమాధి అయినట్టు తెలుస్తోంది. కొంత మంది వరద బీభత్సంలో కొట్టుకుపోయినట్టు సమాచారం. పర్యాటకులు ఈ భయానక దృశ్యాన్ని వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
రెప్పపాటులో భారీ వరద బీభత్సం….
ఈ వీడియోలో కొండల నుంచి భారీగా వరద నీరు కిందికి ప్రవహిస్తున్నట్టు కనిపిస్తోంది. శిథిలాలు, వృక్షాలు కొట్టుకుపోయే దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సైతం అక్కడకు చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెప్పపాటులో భారీ వరద బీభత్సం సృష్టించండంతో చాలా ఇండ్లు కుప్పకూలిపోయాయి. కొంతమంది జలసమాధి అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వంద మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారు సమాచారం రాలేదు.
స్పందించిన ప్రధాని మోదీ….
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. అక్కడ వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..
ఇదిగో వీడియో…
ఉత్తరఖండ్‌లో క్లౌడ్ బరస్ట్… ఒక్కసారిగా గ్రామాలపైకి వచ్చిన వరదలు #Uttarakhand #floods #UttarakhandNews #HeavyRainfall #HeavyRain pic.twitter.com/4Jav5IhJ72
— BIG TV Cinema (@BigtvCinema) August 5, 2025
ALSO READ: Telangana fort: హైదరాబాద్ లోని గోల్కొండ చూశారా? అంతకుమించిన వెయ్యేళ్ల కోటపై ఓ లుక్కేయండి!
A cloudburst in #Uttarkashi’s Dharali village triggered flash floods & landslides, engulfing homes in debris-laden waters. Eyewitness video shows the scale of destruction. Scientists warn warming in the Himalayas is making such extreme rains more frequent#Uttarakhand pic.twitter.com/jsPfjbUldG
— Noman (@nomanssiddiqui) August 5, 2025
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ వరద బీభత్సం…
పొరుగు రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం ఒక్క రోజులోనే 310 రోడ్లు, ఒక జాతీయ రహదారిపైకి భారీ వరద నీరు వచ్చి చేరింది. భారీ శిథిలాలు రహదారులపైకి వచ్చి చేరడంతో.. రోడ్లు మూసివేతకు గురయ్యాయి. సోమవారం మండీ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై ప్రయాణిస్తూ లోయలో పడిపోయి మరణించారు. ఈ వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం 103 మరణాలు నమోదయినట్టు అధికారులు తెలిపారు. మరో 36 మంది తప్పిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
ALSO READ: MLA Rajagopal Reddy: అందుకే నాకు మంత్రి పదవి దక్కలేదు.. ఎమ్యెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు